News October 21, 2025

మాదకద్రవ్య రహిత రాష్ట్రం కోసం ఈగల్ నిఘా: కలెక్టర్

image

మాదకద్రవ్య రహిత రాష్ట్రం కోసం ఈగల్ నిఘా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి గంజాయి, మత్తు పదార్థాల ఉత్పత్తి, కఠిన చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. అదృశ్యమైన 670 మంది బాలికలను ఒక్క నెలలోనే గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించారన్నారు. ఆపరేషన్ సేఫ్ డ్రైవ్ నిర్వహించి 25,807 కేసులు నమోదు చేసి రూ.40.62 లక్షల జరిమానా విధించారని అన్నారు.

Similar News

News October 21, 2025

REWIND 2023 పోల్.. జూబ్లీహిల్స్‌లో 1,374 మంది నోటాకు ఓటేశారు!

image

2023 డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోటీ చేసిన 19 మందిని 1,374 మంది ఓటర్లు తిరస్కరించారు. అంటే వీరంతా NOTA (None of The Above)కు ఓటు వేశారన్న మాట. ఇదిలా ఉండగా వెయ్యి ఓట్లలోపు ఇద్దరు అభ్యర్థులు సాధించగా 500లోపు ఇద్దరు, 200లోపు ఆరుగురు, ఐదుగురు 100లోపు ఓట్లు సాధించారు. ఆనందరావు అనే ఇండిపెండెంట్ అభ్యర్థి 53 ఓట్లతో చివరి స్థానంలో నిలిచారు.

News October 21, 2025

అన్నమయ్య జిల్లాలో భారీ వర్షాలు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

అన్నమయ్య జిల్లాలో ఇవాళ భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ సూచించారు. అలాగే కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఎక్కడైనా సమస్యలు ఏర్పడితే 08561-293006 నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. కంట్రోల్ రూమ్‌లో 24 గంటలు సిబ్బంది ఉండేలా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.

News October 21, 2025

తెలంగాణ రైజింగ్ – 2047′ సర్వేకు విశేష స్పందన: కలెక్టర్

image

తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు రూపకల్పనకై ఉద్దేశించిన “తెలంగాణ రైజింగ్ – 2047” సిటిజన్ సర్వేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. వారం రోజుల క్రితం ప్రారంభించిన ఈ సర్వేలో వివిధ ప్రాంతాల నుంచి పౌరులు పాల్గొని, విలువైన సమాచారాన్ని అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సర్వే ఈనెల 25 వరకు కొనసాగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.