News February 10, 2025

మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి: నెల్లూరు ఎస్పీ

image

యువకులు మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని నెల్లూరు జిల్లా ఎస్పీ జి. కృష్ణ కాంత్ తెలిపారు. మత్తు పదార్థాల వ్యసనం వల్ల సమాజంలో గౌరవం పోతుందన్నారుతల్లిదండ్రులు కూడా నిరంతరం తమ బిడ్డలపై పర్యవేక్షణ ఉంచాలని సూచించారు. మాదకద్రవ్యాల అమ్మకాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే 1972 నంబర్‌కు తెలపాలని సూచించారు.

Similar News

News February 10, 2025

నెల్లూరు పోలీస్ గ్రీవెన్స్‌కు 98 అర్జీలు

image

పోలీసు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన అర్జీలను విచారించి చట్టపరంగా న్యాయం చేస్తామని SP జి. కృష్ణ కాంత్ తెలిపారు. సోమవారం జిల్లా నలుమూలల నుంచి 98 ఫిర్యాదులు అందాయని ఆయన వెల్లడించారు. వాటి పరిష్కారానికి ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News February 10, 2025

ఒత్తిడి అధిగమిస్తేనే ఉత్తమ ఫలితాలు: నెల్లూరు కలెక్టర్ 

image

నెల్లూరు ఈఎస్‌ఆర్‌ఎం ఉన్నత పాఠశాలలో సోమవారం ప్రధాని మోదీ పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ విద్యార్థులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ.. మీరు రాసే పరీక్షల్లో ఒత్తిడి అధిగమిస్తేనే మంచి ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ బాలాజీ రావు, విద్యార్థులు పాల్గొన్నారు.

News February 10, 2025

కావలి: కస్తూర్బా ఘటనపై హోంమంత్రి అనిత ఆరా!

image

కావలి రూరల్ మండలం ముసునూరు శివారు ప్రాంతంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో అర్ధరాత్రి గుర్తు తెలియని అగంతకుడు ప్రవేశించడం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర హోం మంత్రి అనిత కావలి డీఎస్పీ శ్రీధర్‌ను ఫోన్లో వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. విద్యాలయం పరిసర ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. బాలికల తల్లిదండ్రులు ఎటువంటి ఆందోళన చెందొద్దని మంత్రి కోరారు.

error: Content is protected !!