News October 6, 2025
మాదక ద్రవ్యాల బాధితుల కోసం న్యాయ సహాయ కేంద్రం

కరీంనగర్ జిల్లా ప్రధాన ఆసుపత్రిలో సోమవారం న్యాయ సహాయ కేంద్రాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. వెంకటేష్ ప్రారంభించారు. మాదక ద్రవ్యాల బారిన పడిన బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు న్యాయ సహాయం అందించే పథకంలో భాగంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కేంద్రంలో ఒక న్యాయవాది, పారా లీగల్ వాలంటీర్‌ను నియమించినట్లు వెల్లడించారు. బాధితులు న్యాయ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News October 8, 2025
‘బకాయిలు చెల్లించేవరకు విద్యార్థులకు అనుమతి నిరాకరణ’

ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఫీజు బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో కరీంనగర్ జిల్లాలోని పలు పాఠశాలలు విద్యార్థులను అనుమతించడం లేదు. బకాయిలు విడుదలయ్యే వరకు విద్యార్థులను అనుమతించబోమని పాఠశాలల యజమాన్యాలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. దీంతో తమ పిల్లల చదువులకు ఆటంకం కలుగుతుందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించాలని కోరుతున్నారు.
News October 7, 2025
ఎన్నికల విధులు నిర్లక్ష్యం చేయవద్దు: కలెక్టర్

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నోడల్ అధికారులు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి పమేలా సత్పతి ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి (ఎంసీసీ) అమలుపై అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఎన్నికల నిర్వహణలో విధులు కేటాయించబడిన అధికారులు ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా పనిచేయాలని సూచించారు.
News October 7, 2025
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: కలెక్టర్

మహిళా ఆటో డ్రైవర్లు ఆర్థిక సాధికారత సాధించి తోటి మహిళలకు ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో దుర్గాబాయి దేశ్‌ముఖ్ మహిళా, శిశు వికాస కేంద్రంలో ఎలక్ట్రిక్ ఆటో డ్రైవింగ్‌లో శిక్షణ పొంది ఉపాధి పొందుతున్న మహిళలతో ఆమె మంగళవారం సమావేశమయ్యారు. మహిళలు కేవలం డ్రైవింగ్‌లోనే కాక విభిన్న రంగాలలో రాణించాలని ఆకాంక్షించారు.