News December 24, 2025

మానకొండూరు: పీజీటీ జగన్నాథంపై సస్పెన్షన్ వేటు

image

మానకొండూరు సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల PGT గోలి జగన్నాథంను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ పమేలా సత్పతి ఉత్తర్వులు జారీ చేశారు. సహోద్యోగులపై వేధింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో పాటు ఆయన ప్రవర్తనపై ఎంఈఓ, డీఈఓలకు గతంలో అనేక ఫిర్యాదులు అందాయి. ఈ అంశంపై విచారణ జరిపించిన కలెక్టర్, వేధింపులు నిజమని తేలడంతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఇంచార్జ్ ప్రిన్సిపల్ బాధ్యతల నుంచి తొలగిస్తూ సస్పెన్షన్ వేటు వేశారు.

Similar News

News December 30, 2025

అరటి గెలల నాణ్యత పెరగాలంటే?

image

అరటిలో పండు పరిమాణం, నాణ్యత పెంచేందుకు గెలల్లోని ఆఖరి హస్తం విచ్చుకున్న 5వ రోజు మరియు 15వ రోజున లీటరు నీటికి సల్ఫేట్ ఆఫ్ పొటాష్ 5 గ్రాములను కలిపి గెలలపై పిచికారీ చేయాలి. దీనితో పాటు 2 శాతం రంద్రాలు చేసిన తెల్లని పారదర్శక పాలిథీన్ సంచులను గెలలకు తొడగాలి. దీని వల్ల అరటిపండ్ల పరిమాణం పెరిగి లేత ఆకుపచ్చ రంగులో ఆకర్షణీయంగా తయారై నాణ్యమైన పండ్లను పొందవచ్చు. ఇవి ఎగుమతికి అనుకూలంగా ఉంటాయి.

News December 30, 2025

ఈ ఏడాది నేరాలను తగ్గుముఖం పట్టించాం: విశాఖ సీపీ

image

విశాఖలో పోలీసులు చేసిన కృషి వల్ల 17 విభాగాల్లో గత ఏడాది కంటే నేరాలకు సంబంధించిన కేసుల సంఖ్య తగ్గించగలిగామని సీపీ శంఖబత్ర భాగ్చీ వెల్లడించారు. వార్షిక ముగింపులో భాగంగా ఆయన మాట్లాడారు. గత ఏడాది 5,921 కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది 5,168 కేసులు నమోదయ్యాయని చెప్పారు. మర్డర్ కేసులు 35 నమోదు కాగా.. కిడ్నాప్ కేసులు 17, హత్యాయత్నం కేసులు 135 నమోదు చేసినట్లు తెలిపారు.

News December 30, 2025

రైల్వే కోడూరు మాజీ ఎమ్మెల్యే మృతి

image

ఉమ్మడి కడప జిల్లా రైల్వే కోడూరు మాజీ ఎమ్మెల్యే గుంటి వెంకటేశ్వర ప్రసాద్ గుండెపోటుతో మంగళవారం మృతి చెందారు. ఇటీవల అనారోగ్యంతో తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందారని ఆయన కుటుంబీకులు తెలిపారు. 1999లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. 2004లో కోడూరు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. ఆయన మృతిపై పలువురు సంతాపం వ్యక్తం చేశారు.