News October 3, 2025

మానకొండూరు: మూడు కార్లను ఢీ కొట్టిన లారీ

image

కరీంనగర్‌ జిల్లా మానకొండూరు మండలం ఈదులగట్టేపల్లి శివారులో లారీ డ్రైవర్‌ అజాగ్రత్తతో భారీ ప్రమాదం జరిగింది. కరీంనగర్‌ నుంచి వరంగల్‌ వైపు వెళ్తున్న లారీ ముందున్న ఓ కారును ఢీ కొట్టి, అదుపుతప్పి ఎదురుగా వస్తున్న మరో రెండు కార్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో కార్లు ధ్వంసమవగా, ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి.

Similar News

News October 3, 2025

KNRలో 159 GPలను ఏలనున్న మహిళామణులు..!

image

స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు అమలు చేయడంతో మహిళల స్థానాలు భారీగా పెరగనున్నాయి. కరీంనగర్ జిల్లాలో 5,30,337 మహిళా ఓటర్లు ఉండగా.. ఇందులో 7 జడ్పీటీసీ స్థానాలు, 7 ఎంపీపీ, 85 ఎంపీటీసీ, 159 గ్రామపంచాయతీలకు, 1,468 వార్డులకు సభ్యులుగా మహిళలు ప్రాతినిధ్యం వహించనున్నారు. దీంతో ప్రజాస్వామ్య వ్యవస్థలో మహిళలకు సముచిత గౌరవం దక్కనుంది. పాలనా వ్యవస్థలో వీరు కీలకం కానున్నారు.

News October 3, 2025

జిల్లా జాగృతి అధ్యక్షుడిగా హరిప్రసాద్

image

కరీంనగర్ జిల్లా జాగృతి అధ్యక్షుడిగా గుంజపడుగు హరిప్రసాద్ నియామకయ్యారు. ఈ మేరకు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిర్ణయం తీసుకున్నారు. జాగృతి మొదలుపెట్టిన నాటి నుంచి జిల్లాలో క్రియాశీలకంగా పనిచేసినందుకు గాను జిల్లా జాగృతి అధ్యక్షుడిగా హరిప్రసాద్‌ను కవిత ఎంపిక చేశారు. కరీంనగర్ జిల్లాలో జాగృతి బలోపేతానికి మరింత కృషి చేస్తానని హరిప్రసాద్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

News October 2, 2025

KNR: జంబిపూజ రాక్షస సంహారానికి పదేళ్లు..!

image

KNR పట్టణంలోని కిసాన్ నగర్‌లో 2015లో ప్రారంభమైన జంబిపూజ రాక్షస సంహారం కార్యక్రమం ఈ సంవత్సరంతో 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇక నేటి దసరా సంబరాలకు కిసాన్ నగర్ జంబిగద్దె వేదిక సిద్ధమైంది. ఈ కార్యక్రమ నిర్వహణ కోసం స్థానికులు ఉత్సాహంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పదేళ్ల సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. ఈ ఏడాది కూడా వేడుకలను వైభవంగా జరుపుకోనున్నారు. ప్రజలు భక్తిశ్రద్ధలతో ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు రెడీ అయ్యారు.