News August 26, 2025
మానకొండూర్: కవ్వంపల్లికి బండి సంజయ్ పరామర్శ

కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సోదరుడు కవ్వంపల్లి రాజేశం ఇటీవల అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం కవ్వంపల్లి ఇంటికి వెళ్లిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆయనను పరామర్శించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి కూడా బండి సంజయ్‌తోపాటు ఉన్నారు.
Similar News
News August 27, 2025
కరీంనగర్: ఆర్టీసీ ఉత్తమ ఉద్యోగులకు ప్రగతి చక్ర అవార్డుల ప్రదానం

KNR బస్టాండ్ ఆవరణలోని సమావేశ మందిరంలో ఆర్టీసీలో 2024-25 ఆర్థిక సం.కి సంబంధించి 4వ త్రైమాసికంలో, 2025-26 ఆర్థిక సం.మొదటి త్రైమాసికంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రగతి చక్ర అవార్డుల ప్రదానం చేశారు. ఇందులో భాగంగా రెండు త్రైమాసికాలకు గాను 57మంది ఉద్యోగులు, 2 బస్ స్టేషన్లకు అవార్డులు ప్రదానం చేశారు. KNR RM బి.రాజు, డిప్యూటీ RMలు ఎస్. భూపతిరెడ్డి, పి.మల్లేశం ఉద్యోగులకు అవార్డులు అందించారు.
News August 27, 2025
కరీంనగర్: పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

కరీంనగర్ జిల్లాలో కొత్తగా మంజూరైన 22 పూర్వ ప్రాథమిక పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం 22 మహిళా బోధకులు, 22 మహిళా ఆయాల నియామకానికి దరఖాస్తులు ఆహ్వనిస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైని తెలిపారు. బోధకులకు ఇంటర్, ఆయాలకు 7వ తరగతి అర్హత అని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఈనెల 28న దరఖాస్తులను కరీంనగర్ జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో అందజేయాలని కోరారు.
News August 26, 2025
సేవా దృక్పథంతో వైద్య సేవలు అందించాలి: కరీంనగర్ కలెక్టర్

కరీంనగర్‌లోని కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకులకు ‘క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్, పీఎన్‌డీటీ చట్టం’పై వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడారు. ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులు ఎవరైనా సేవా దృక్పథంతో పని చేయాలన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులు నిబంధనలు పాటించాలని సూచించారు. సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.