News December 11, 2025

మానవత్వం చాటుకున్న ఎస్పీ రాజేష్ చంద్ర

image

కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర వడ్లూర్–ఎల్లారెడ్డి, మర్కల్, సదాశివనగర్, గోకుల్ తండా, రామారెడ్డి గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ ప్రక్రియ, భద్రతా ఏర్పాట్లు, సిబ్బంది పనితీరును సమీక్షించారు. సదాశివనగర్ పోలింగ్ కేంద్రం వద్ద అలసటతో ఉన్న ఒక వృద్ధురాలిని గమనించి, ఎస్పీ స్వయంగా వీల్‌చైర్ అందించారు. రామారెడ్డిలో చిన్న పాపతో ఓటు వేయడానికి వచ్చిన తల్లిని అభినందించారు.

Similar News

News December 14, 2025

ధన్వాడ: బాండ్ పేపర్ రాసిన బీజేపీ అభ్యర్థి గుంత కొండయ్య గెలుపు

image

గ్రామ అభివృద్ధి కోసం ఆయన రూ.50 బండ్ పేపర్ రాసిన ధన్వాడ మండలంలోని కిష్టాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ అభ్యర్థి గుంత కొండయ్య సమీప అభ్యర్థి గండిరాజుపై గెలుపొందారు. ప్రజాసేవే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తానని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని నూతన సర్పంచ్ గుంత కొండయ్య తెలిపారు. అభిమానులు, పార్టీ నాయకులు ఆయనకు అభినందనలు తెలిపారు.

News December 14, 2025

జగిత్యాల: ఎన్నికల కోడ్ ముగిసే వరకు విజయోత్సవ ర్యాలీల నిషేధం

image

జగిత్యాల జిల్లాలో రెండవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు గ్రామాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టామని చెప్పారు.కౌంటింగ్ కేంద్రాల వద్ద అనవసర గుంపులు ఏర్పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు.మూడవ విడత పూర్తయ్యే వరకు మోడల్ కోడ్ ఆఫ్ అమల్లో ఉంటుందన్నారు.

News December 14, 2025

జైస్వాల్ రావాల్సిన టైమ్ వచ్చిందా?

image

టీమ్ ఇండియా యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ టీ20ల్లో అదరగొడుతున్నారు. గత 13 ఇన్నింగ్సుల్లో అతడి స్కోర్లు 67, 6, 75, 51, 74, 49, 70*, 13, 34, 50, 36, 29, 101గా ఉన్నాయి. దీంతో అతడిని నేషనల్ టీమ్‌కు సెలెక్ట్ చేయాలనే డిమాండ్లు ఎక్కువయ్యాయి. వరుసగా విఫలం అవుతున్నా గిల్‌కు ఎందుకు అవకాశాలు ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. దీనిపై మీ COMMENT?