News August 19, 2025

మానవత్వం చాటుకున్న చిత్తూరు కలెక్టర్

image

యాదమరి(M) ముస్లిం వాడ 14 కండ్రిగకు చెందిన ఇంతియాజ్ పుట్టుకతోనే మూగవాడు. ఇటీవల రాయి పనికి వెళ్లగా.. అక్కడ జరిగిన బ్లాస్టింగ్‌లో రెండు కళ్లు, కుడిచేయి మణికట్టు వరకు కోల్పోయాడు. ఇతని కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. కలెక్ట్‌రేట్‌లో నిన్న జరిగిన గ్రీవెన్స్ డేకు బాధిత కుటుంబం హాజరై కలెక్టర్ సుమిత్ కుమార్‌కు సమస్యను వివరించారు. ఆయన మానవతా థృక్పథంతో PSR ఫండ్స్ నుంచి రూ.లక్ష అందజేశారు.

Similar News

News September 17, 2025

చిత్తూరు: ఐటీఐలో అడ్మిషన్ల ప్రారంభం

image

చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాలకు నాలుగో విడత దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ రవీంద్రారెడ్డి తెలిపారు. నేటి నుంచి ఈనెల 27వ తేదీ వరకు www.iti.ap.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఐటీఐ విద్యార్థులకు ఈనెల 29న, ప్రైవేట్ విద్యార్థులకు 30వ తేదీన కౌన్సెలింగ్ ఉంటుందని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలకు దగ్గరలోని ఐటీఐని సంప్రదించాలని సూచించారు.

News September 17, 2025

చిత్తూరు: ప్రియురాలి ఇంట్లో వ్యక్తి ఆత్మహత్య

image

చిత్తూరులో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తవణంపల్లె మండలం దిగువమారేడుపల్లికి చెందిన దేవరాజులు(40) భార్య, పిల్లలను వదిలేసి కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. 9ఏళ్లుగా గంగన్నపల్లికి చెందిన ఓ మహిళతో సహజీవనం చేస్తూ అక్కడే ఉంటున్నాడు. ఏమైందో ఏమో మంగళవారం సాయంత్రం ఆమె ఇంట్లోనే అతను ఉరేసుకున్నాడు. మొదటి భార్య సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ నెట్టికంటయ్య తెలిపారు.

News September 17, 2025

చిత్తూరు జిల్లా పర్యాటక అధికారిగా నరేంద్ర

image

చిత్తూరులోని సావిత్రమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కామర్స్ లెక్చరర్ ఏఎం నరేంద్రకు కీలక పదవి లభించింది. ఆయనను పర్యాటక అధికారిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. టూరిజం రంగంపై నరేంద్ర ఇప్పటివరకు అనేక జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని అనేక శాస్త్రీయ పత్రాలను ప్రచురించారు. విద్యారంగంలో విశేష అనుభవంతో పాటు సామాజిక రంగంలోనూ ఆయనకు ఉన్న అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నియమించింది.