News December 25, 2025
మానవత్వం చాటుకున్న మంత్రి శ్రీధర్ బాబు

ఆపదలో ఉన్న పేద కుటుంబానికి మంత్రి శ్రీధర్ బాబు అండగా నిలిచారు. మల్హర్ మండలం అడువాలపల్లికి చెందిన కొత్తపెల్లి సుమన్ హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించారు. భారీ వైద్య ఖర్చులతో ఇబ్బందుల్లో ఉన్న ఆ కుటుంబం దుస్థితిని తెలుసుకున్న మంత్రి.. వెంటనే ఎల్వోసీ మంజూరు చేశారు. ఆసుపత్రికి ఎలాంటి బకాయిలు చెల్లించాల్సిన అవసరం లేకుండా మృతదేహాన్ని అప్పగించేలా చర్యలు తీసుకుని మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు.
Similar News
News January 2, 2026
ఓడీఎఫ్, ఎన్ఆర్ఈజీఎస్ లక్ష్యాల సాధనకు వేగం పెంచాలి: VZM కలెక్టర్

టెలికాన్ఫరెన్స్ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులకు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి శుక్రవారం దిశానిర్దేశం చేశారు. ఓడీఎఫ్, ఓడీఎఫ్ ప్లస్ పూర్తయిన గ్రామాలను వెంటనే డిక్లేర్ చేయాలని, ఇప్పటికే డిక్లేర్ చేసిన గ్రామాల్లో వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్ఆర్ఈజీఎస్ కింద రోజుకు 47 వేల మాన్‌డేస్ లక్ష్యాన్ని తప్పనిసరిగా సాధించాలన్నారు.
News January 2, 2026
గన్నవరం: ‘వంశీ ఎన్నికల అఫిడవిట్‌ను సమర్పించాలి’

వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై AP హైకోర్టు విచారణ చేపట్టింది. ఓ హత్యాయత్నం కేసులో దాఖలైన ఈ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. వంశీపై 20 వరకు కేసులు ఉన్నాయని ప్రభుత్వం అఫిడవిట్‌లో పేర్కొన్నట్లు కోర్టుకు తెలిపింది. అయితే ఎన్నికలకు ముందు కేవలం 3 కేసులు మాత్రమే ఉన్నాయని వంశీ తరఫు న్యాయవాది వాదించారు. వాస్తవంగా ఎన్ని కేసులు ఉన్నాయన్న అంశంపై వంశీ తన ఎన్నికల అఫిడవిట్‌ను సమర్పించాలని ఆదేశించింది.
News January 2, 2026
NGRIలో ఉద్యోగాలు.. అప్లైకి 3రోజులే సమయం

హైదరాబాద్‌లోని CSIR-నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(NGRI)లో 13 సెక్యూరిటీ ఆఫీసర్, MTS పోస్టులకు అప్లై చేయడానికి 3రోజులే(జనవరి 5) సమయం ఉంది. సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుకు ఎక్స్‌సర్వీస్‌మన్, ఎంటీఎస్ పోస్టులకు టెన్త్, ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ట్రేడ్ టెస్ట్/రాత పరీక్ష ద్వారా ఎంపికచేస్తారు. వెబ్‌సైట్: https://www.ngri.res.in/


