News February 17, 2025

మానవత్వం చాటుకున్న హరీశ్ రావు

image

అనారోగ్యంతో బాధపడుతున్న మహిళను ఎమ్మెల్యే హరీశ్ రావు ఆదుకున్నారు. ఆధార్ కార్డు లేదని ప్రమీల అనే మహిళను వైద్యం చేయకుండా ఉస్మానియా ఆసుపత్రి సిబ్బంది బయటకు పంపించారు. సమస్య తన దృష్టికి రావడంతో స్పందించి, మానవత్వం చాటుకుని ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండ్‌తో మాట్లాడి తక్షణం ఆసుపత్రిలో చేర్చుకోవాలని, చికిత్స అందించాలని హరీశ్ రావు ఆదేశించారు.

Similar News

News December 18, 2025

కరీంనగర్: మూడో విడత రిజల్ట్ ఇలా ..!

image

మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో 388 GPలకు ఎన్నికలు జరగగా 20 ఏకగ్రీవమయ్యాయి. మొత్తం 408 GPలకు గాను KNR(D)లో కాంగ్రెస్ 38, BRS 38, BJP 19, ఇతరులు 16 గెలుచుకున్నారు. జగిత్యాల(D)లో కాంగ్రెస్ 66, BRS 37, BJP 6, ఇతరులు 10 స్థానాలు గెలుచుకున్నారు. పెద్దపెల్లి(D)లో కాంగ్రెస్ 67, BRS 18, BJP 3, ఇతరులు 3 స్థానాల్లో గెలవగా సిరిసిల్ల(D)లో కాంగ్రెస్ 15, BRS 43, BRS 10, ఇతరులు 19 స్థానాల్లో విజయం సాధించారు.

News December 18, 2025

డ్వాక్రాలో రూ.10 కోట్ల నగదు గోల్మాల్: కలెక్టర్

image

పల్నాడు జిల్లాలో డ్వాక్రా గ్రూపులకు సంబంధించి అవినీతికి పాల్పడిన యానిమేటర్లపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కృత్తికా శుక్లా తెలిపారు. సీఎం చంద్రబాబుతో జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఈ మేరకు నివేదిక సమర్పించి ప్రభుత్వ గైడెన్స్ కోరారు. జిల్లాలో రూ.10 కోట్ల రూపాయలకు పైగానే డ్వాక్రా గ్రూపు సభ్యుల నగదు గోల్మల్ జరిగినట్లు అయినట్లు అధికారులు గుర్తించారని తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ పథకాల అమలు తెలిపారు.

News December 18, 2025

విశాఖలో కాలుష్య నివారణకు చర్యలు: కలెక్టర్

image

విశాఖలో కాలుష్య నివారణకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. సచివాలయంలో జరిగిన 5వ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. పర్యావరణ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నామని, కాలుష్య కారకాలను గుర్తించి వాటి తీవ్రత తగ్గించేలా ప్రణాళికాబద్ధ చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. అభివృద్ధి పనులకు అటవీ శాఖ అనుమతుల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.