News August 1, 2024
మానవత్వం చాటుకున్న GHMC మేయర్

GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మి మానవత్వం చాటుకున్నారు. గురువారం సా. KBR పార్క్‌కు ఆమె వాకింగ్‌కు వెళ్లారు. పార్క్ వద్ద నిస్సహాయస్థితిలో ఉన్న ఓ వృద్ధుడిని గమనించారు. స్వయంగా అతడి వద్దకు వెళ్లి సమస్యను తెలుసుకున్నారు. గత రెండు రోజులుగా ఏమీ తినలేదని, ఒక కాలు కూడా లేదని సదరు వృద్ధుడు తెలిపాడు. చలించిపోయిన ఆమె వెంటనే డీఆర్ఎఫ్ సిబ్బందిని పిలిపించారు. పోలీసుల సహాయంతో బేగంపేటలోని షెల్టర్ హోంకు తరలించారు.
Similar News
News November 2, 2025
HYD: తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ నూతన కమిటీ ఏర్పాటు

తెలంగాణ జాగృతి బలోపేతంపై కవిత ఫోకస్ పెట్టారు. తాజాగా టీచర్స్ ఫెడరేషన్ నూతన కమిటీని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఫెడరేషన్ నూతన కమిటీ అధ్యక్షుడిగా మోరం వీరభద్రరావు, ఉపాధ్యక్షుడిగా బుర్ర రమేశ్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా జాడి శ్రీనివాస్, కోశాధికారిగా ఘనపురం దేవేందర్‌ను నియమించినట్లు ఆమె తెలిపారు. వెంటనే వీరి నియామకాలు అమల్లోకి వస్తాయని కవిత పేర్కొన్నారు.
News November 2, 2025
HYD: చంచల్‌గూడ జైలుకు ఒమర్ అన్సారీ

HYDలోని చాదర్‌ఘాట్ పరిధిలో గల విక్టోరియా ప్లే గ్రౌండ్‌లో గత శనివారం కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిందితుడు ఒమర్ అన్సారీ కోలుకోవడంతో శనివారం పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు ఆదేశించడంతో అతడిని చంచల్‌గూడ జైలుకు పోలీసులు తరలించారు.
News November 2, 2025
హైదరాబాద్ NFCలో అప్రెంటిస్ ఖాళీలు

HYDలోని న్యూక్లియర్ ఫ్యూల్ కాంప్లెక్స్ (NFC)లో 405 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. వివిధ విభాగాల్లో ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకునేందుకు అర్హులు. ఆన్‌లైన్ దరఖాస్తుకు నవంబర్ 15 చివరి తేదీ. నెలకు 10,500 స్ట్రైఫెండ్ చెల్లిస్తారు. వివరాలకు వెబ్‌సైట్: https://www .nfc.gov.in/recruitment.html


