News January 26, 2025

మానవపాడు: నేడు ఆ గ్రామంలోనే పథకాల ప్రారంభం

image

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రారంభించనున్న నాలుగు పథకాలను మానవపాడు మండలం చంద్రశేఖర్ నగర్ గ్రామంలో ప్రారంభిస్తున్నట్లు మానవపాడు ఎంపీడీఓ భాస్కర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ, జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం నేడు మధ్యాహ్నం 1 గంటలకు నాలుగు పథకాలను ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు పాల్గొననున్నారని ఆయన తెలిపారు.

Similar News

News November 2, 2025

రేర్ ఎర్త్ మాగ్నెట్స్.. చైనాకు చెక్ పెట్టనున్న భారత్

image

రేర్ ఎర్త్ మాగ్నెట్స్ ఉత్పత్తిలో 90% వాటా కలిగిన చైనాకు సవాల్ విసిరేందుకు భారత్ సిద్ధమైంది. దేశీయంగా ఈ రంగంలో ప్రోత్సాహకాలను $290M నుంచి $788Mకు పెంచనున్నట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి. ఈ ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, పునరుత్పాదక, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్ రంగాలకు ఈ రేర్ ఎర్త్ మాగ్నెట్స్ ఎంతో కీలకం. అందుకే వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంది.

News November 2, 2025

తుఫానుతో నష్టపోయిన నేతన్నలకు రూ.5వేలు: మంత్రి

image

AP: మొంథా తుఫానుతో నష్టపోయిన చేనేత కుటుంబాలకు అండగా ఉంటామని మంత్రి సవిత తెలిపారు. నీటమునిగి తడిచిపోయిన నూలు, రంగులు, రసాయనాలకు రూ.5 వేల చొప్పున నష్టపరిహారం అందజేస్తున్నామని చెప్పారు. వర్షాలతో ఉపాధి కోల్పోయిన చేనేత కార్మికుల కుటుంబాలకు 50 కేజీల బియ్యం, లీటర్ పామాయిల్, కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, కేజీ పంచదార ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

News November 2, 2025

కదిరిలో 30 మందిపై రౌడీ షీట్లు నమోదు

image

హత్య, హత్యాయత్నం, గంజాయి అమ్మకాలు వంటి తీవ్ర నేరాలకు పాల్పడుతున్న పాత నేరస్థులపై కదిరి టౌన్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. కదిరి డీఎస్పీ శివనారాయణస్వామి ఆదేశాలతో 30మందిపై రౌడీషీట్లు నమోదు చేసినట్లు కదిరి టౌన్ సీఐ నారాయణరెడ్డి తెలిపారు. తీవ్రమైన నేరాలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న ముగ్గురిపై PD చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడానికి జిల్లా కలెక్టర్‌కు నివేదిక పంపినట్లు చెప్పారు.