News December 25, 2025
మానవాళి మహోదయానికి క్రీస్తు బోధనలు: రామ్మోహన్ నాయుడు

మానవాళి మహోదయానికి క్రీస్తు బోధనలు ఎంతగానో దోహద పడతాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయడు అన్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమని పంచడమే కిస్మస్ సందేశమని అన్నారు. క్రీస్తు బోధనలు సమాజంలో ప్రేమ, కరుణ, శాంతిని పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు. క్రిస్మస్ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు.
Similar News
News December 25, 2025
శ్రీకాకుళం: 9 పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లికూతురు

ఇచ్ఛాపురంలో ఒక నిత్య పెళ్లికూతురు ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇచ్ఛాపురం మున్సిపాలిటీ పరిధిలో ఓ యువతి మరో మహిళ సహాయంతో వరుసగా 8 పెళ్లిళ్లు చేసుకుంది. ఇటీవల వివాహం అనంతరం అనుమానం రావడంతో బాధితుడు ఇచ్ఛాపురం పోలీసులను ఆశ్రయించాడు. దీంతో నిత్యపెళ్లికూతురుతో పాటు మరో మహిళ పరారీలో ఉన్నట్లు సమాచారం.బరంపురానికి చెందిన ఒక యువకుడిని పెళ్లిచేసుకుని మోసం చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని పోలీసులు తెలిపారు.
News December 25, 2025
మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన

ఈనెల 26న మీ చేతికి మీ భూమి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత ఉన్నప్పటికీ గత పాలకుల తప్పిదాల వల్ల 22ఏ జాబితాలోకి వెళ్లిన భూముల విషయంలో బాధితులకు న్యాయం జరగలేదన్నారు. ఆరోజు ఉదయం 9.30 గంటలకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో 22ఏ భూములపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందన్నారు.
News December 25, 2025
సిక్కోలు సిన్నోడు SUPER

ఈ రోజుల్లో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే గగనం.. అలాంటిది శ్రీకాకుళం జిల్లా, పొందూరు మండలం, మజ్జిలిపేట గ్రామానికి చెందిన పైడి.సతీష్ ఎలాంటి కోచింగ్ లేకుండా ఒకే సారి మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. UPSC లో గ్రూప్-B నర్సింగ్ ఆఫీసర్, AMIIS లో నర్సింగ్ ఆఫీసర్, తెలంగాణలో MHSRB, 51 ర్యాంకుతో నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలను సంపాదించాడు. సతీష్ కు గ్రామస్తులు అభినందనలు తెలిపారు.


