News April 20, 2025
మానవ తప్పిదాలు, అజాగ్రత్తతోనే ప్రమాదాలు: ఎస్పీ

మానవ తప్పిదాలు, నిర్లక్ష్యం, అజాగ్రత్త వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యలయంలో ఆయన మాట్లాడుతూ.. జాతీయ రహదారి వెంట ఉండే గ్రామాల ప్రజలు, వ్యవసాయ పనులకు వెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడపొద్దని, హెల్మెట్ ధరించాలి, సీటు బెల్ట్ పెట్టుకోవాలి, అధిక వేగంతో వాహనం నడపొద్దన్నారు.
Similar News
News September 10, 2025
మెదక్: విద్యుదాఘాతంతో యువ రైతు మృతి

చేగుంట మండలం చిటోజిపల్లికి చెందిన తలారి గోవర్ధన్(32) అనే యువ రైతు పొలంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. మంగళవారం ఉదయం తన వ్యవసాయ పొలంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో దాన్ని సరిచేయడానికి ప్రయత్నిస్తుండగా, ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడి భార్య తలారి స్వప్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News September 10, 2025
నర్సాపూర్: తల్లి, ఇద్దరు పిల్లలు మిస్సింగ్.. కేసు నమోదు

పిల్లలను ఆసుపత్రిలో చూపించడానికి వెళ్లిన తల్లి, ఇద్దరు పిల్లలు అదృశ్యమైన ఘటన నర్సాపూర్‌లో చోటుచేసుకుంది. ఎస్ఐ లింగం తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని నారాయణపూర్‌కు చెందిన వివాహిత తన ఇద్దరు పిల్లలను మంగళవారం ఆస్పత్రిలో చూపించడానికి వెళ్లి కనిపించకుండా పోయింది. ఎక్కడ వెతికినా ఆచూకీ లభించకపోవడంతో భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
News September 9, 2025
మెదక్: కాళోజీ సేవలు చిరస్మరణీయం: డీఆర్ఓ

స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రజాకవి కాళోజి నారాయణరావు సేవలు చిరస్మరణీయమని డీఆర్ఓ భుజంగరావు అన్నారు. కాళోజీ జయంతిని పురస్కరించుకొని మెదక్ కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కాళోజీ చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. కాళోజీ వ్యక్తిత్వం, రచనలు ప్రజలను చైతన్య పరిచాయన్నారు. ఆయన చూపిన దారిని విడవొద్దన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో యూనస్, అధికారులు పాల్గొన్నారు.