News January 5, 2025

మానవ వ్యాధుల నివారణలో ఔషధ మొక్కల పాత్ర కీలకం

image

మానవ వ్యాధుల నివారణలో ఔషధ మొక్కల పాత్ర కీలకమని కాకతీయ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు ఆచార్య ముస్తఫా అన్నారు. శనివారం మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఔషధ మొక్కలపై నిర్వహించిన అతిథి ఉపన్యాస కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. వృక్షాల వర్గీకరణ, ఔషధ మొక్కలు, వృక్షజాతుల గుర్తింపు , ముఖ్యంగా వ్యాధుల నివారణలో మొక్కల యొక్క పాత్రను విద్యార్థులకు వివరించారు.

Similar News

News January 6, 2025

ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

image

ప్రజావాణి ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని NLG జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. రెవెన్యూ శాఖతో పాటు, అన్ని శాఖల అధికారులు ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.

News January 6, 2025

NLG: MGU LAW ఫలితాలు విడుదల

image

నల్గొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం లా ఐదు సంవత్సరాల పదవ సెమిస్టర్ (రెగ్యులర్‌) & 5, 6, 7, 8, 9 సెమిస్టర్ల (బ్యాక్లాగ్) ఫలితాలను విడుదల చేసినట్లు సీఓఈ డా.ఉపేందర్ రెడ్డి తెలిపారు. అలాగే మూడు సంవత్సరాల లా డిగ్రీ ఆరవ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. వివరాలకు https://mguniversity.in/వెబ్సైట్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.

News January 6, 2025

భువనగిరి: KTRకు చామల కౌంటర్.. మీ కామెంట్?

image

రైతుభరోసాపై KTRట్వీట్‌కు భువనగిరి MP చామల కిరణ్ కౌంటర్ ఇచ్చారు. వరి వేస్తే ఉరి అన్న మీరెక్కడ..? అత్యధికం ధాన్యం కొనుగోలు చేసి చరిత్ర సృష్టించిన మేమెక్కడ..? అని మండిపడ్డారు. రాళ్లు రప్పలకు పెట్టుబడి పేరిట రూ.22 వేల కోట్లు మింగిన BRSతో మా కాంగ్రెస్‌కు పోలికా..? అని ధ్వజమెత్తారు. రైతు భరోసా రూ.12 వేలు, బోనస్ రూ.500 ఇచ్చి రైతులను ఆదుకుంటున్నామని X(ట్విట్టర్)లో పేర్కొన్నారు. MP వ్యాఖ్యలపై మీ కామెంట్..?