News January 21, 2026
మానస స్నానం అంటే తెలుసా?

మానస స్నానం అంటే నీటితో కాకుండా, మనసుతో చేసే పవిత్ర స్నానం. విష్ణువును ధ్యానిస్తూ, ఆయన రూపం, దివ్య నామాలను మనసులో నిలుపుకోవడమే దీని ఉద్దేశ్యం. పుండరీకాక్షుడిని స్మరించడం వల్ల లోపల, బయట కూడా శుద్ధి జరుగుతుంది. బాహ్య స్నానం శరీరాన్ని శుభ్రపరిస్తే, మానస స్నానం మనసులోని మలినాలను, అశాంతిని తొలగిస్తుంది. అన్ని రకాల స్నాన పద్ధతులలో ఇది అత్యంత విశిష్టమైనదిగా, పుణ్యప్రదమైనదిగా శాస్త్రాలు చెబుతున్నాయి.
Similar News
News February 21, 2026
చిత్తూరు: ఆన్‌లైన్‌లోనూ ఫిర్యాదు చేయండి!

చిత్తూరులో జరిగే గ్రీవెన్స్ డే కోసం ఎంతోమంది కష్టపడి వస్తుంటారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం ఆన్‌లైన్‌లోనూ ఫిర్యాదులు స్వీకరిస్తోంది. http//:pgrs.ap.gov.in వెబ్ సైట్‌లో మీ సమస్యను నమోదు చేసి రసీదు పొందవచ్చు. అలాగే 1100కి ఫోన్ చేసి సమస్య చెప్పినా నమోదు చేసుకుంటున్నారు. ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు.
News February 21, 2026
కెరీర్ గైడెన్స్.. కాల్ చేసి సరైన మార్గాన్ని ఎంచుకోండి!

టెన్త్, ఇంటర్ తర్వాత ఏం చేయాలనే సందేహంలో మీ పిల్లలున్నారా? అలాంటి వారికి సరైన మార్గాన్ని సూచించేందుకు తెలంగాణ ప్రభుత్వం కెరీర్ గైడెన్స్ టోల్ ఫ్రీ నంబర్‌ను ప్రారంభించింది. విద్యార్థులు భవిష్యత్తులో సరైన కోర్సులను ఎంచుకునేందుకు 1800 425 2428 నంబర్‌కు ఫోన్ చేసి సలహాలు పొందవచ్చు. ఆదివారం మినహా ప్రతిరోజూ 9AM నుంచి 6PM వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. SHARE IT
News February 21, 2026
YCP మాజీ ఎంపీ బుట్టా రేణుక ఆస్తుల వేలం

YCP మాజీ ఎంపీ బుట్టా రేణుక, ఆమె భర్త నీలకంఠ శివ ఆస్తులను వేలం వేయనున్నట్లు LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ప్రకటించింది. వీరు ఆ కంపెనీ నుంచి గతంలో ₹340Cr లోన్ తీసుకున్నారు. కొంతకాలం తర్వాత వాయిదాలు కట్టడం ఆపేయడంతో బకాయిల మొత్తం ₹782.07Crకు చేరింది. దీంతో వారి ఆస్తుల వేలం ప్రక్రియను LIC ప్రారంభించింది. తాజాగా HYD KPHBలో 3,830 చ.గజాల స్థలం వేలానికి ప్రకటన ఇచ్చింది. దీని కనీస విలువ ₹65Crగా పేర్కొంది.


