News March 21, 2025

మానాపురం ROB పనులపై కలెక్టర్ సీరియస్

image

మానాపురం ROB నిర్మాణం ఆలస్యం అయినందున కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ అంబేడ్క‌ర్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ తన ఛాంబర్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. నోటీసు అందిన రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని, లేనిచో చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. పనుల ఆలస్యం వలన ట్రాఫిక్ సమస్యతో పాటు పబ్లిక్‌కు ఇబ్బంది కలుగుతోందని తెలిపారు.

Similar News

News March 22, 2025

నిధులు ఇవ్వమని సీఎంను కోరుతా: VZM కలెక్టర్

image

జిల్లాకు ప్ర‌ధాన‌మైన తోట‌ప‌ల్లి కుడి ప్ర‌ధాన కాల్వ‌, తార‌క‌రామ తీర్థ‌సాగ‌రం ప్రాజెక్టుల‌ను పూర్తిచేసేందుకు అవ‌స‌ర‌మైన నిధుల‌ను మంజూరు చేయాల‌ని త్వ‌ర‌లో జ‌రిగే క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో సీఎంను కోర‌నున్న‌ట్టు క‌లెక్ట‌ర్ అంబేడ్క‌ర్ తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో సమీక్ష జరిపారు.ఆయా ప్రాజెక్టుల ప‌నులు, భూసేక‌ర‌ణ‌, పున‌రావాసం పూర్తిచేసేందుకు ఏమేర‌కు నిధులు అవ‌స‌ర‌మ‌వుతాయో నివేదిక ఇవ్వాలని కోరారు.

News March 21, 2025

నెలాఖరులోగా మంజూరును పూర్తి చేయాలి: కలెక్టర్

image

బ్యాంకుల‌కు కేటాయించిన ల‌క్ష్యాల మేర‌కు ఈ నెలాఖ‌రులోగా ప‌థ‌కాల‌ను మంజూరు చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బిఆర్ అంబేద్క‌ర్ కోరారు. జిల్లా స్థాయి బ్యాంక‌ర్ల స‌మీక్షా క‌మిటీ స‌మావేశం క‌లెక్ట‌రేట్‌లో శుక్ర‌వారం జ‌రిగింది. క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ.. ప్ర‌తిబ్యాంకుకు ఇచ్చిన ల‌క్ష్యాల మేర‌కు ఈ నెలాఖ‌రులోగా ప‌థ‌కాలు మంజూరు చేసి, గ్రౌండింగ్ అయ్యేలా చూడాల‌ని ఆదేశించారు. విశ్వకర్మపై దృష్టి సారించాలన్నారు.

News March 21, 2025

VZM: సబార్డినేట్ పోస్టులకు దరఖాస్తు గడువు పెంపు

image

జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీలో ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల కోసం దరఖాస్తుల తేదీని ఈనెల 22వరకు పొడిగించినట్లు జిల్లా జడ్జి సాయి కళ్యాణ చక్రవర్తి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ADR మీడియేషన్ కేంద్రంలో 2 పోస్టులను అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన (SC, OC) నియామకం కోసం మహిళా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. దరఖాస్తులను జిల్లా కోర్ట్ భవనంలో ఉన్న న్యాయ సేవల కేంద్రంలో సమర్పించాలన్నారు.

error: Content is protected !!