News December 26, 2025
మానుకోటకు పొంగులేటి, KTR

మానుకోటలో పొంగులేటి, KTR పర్యటన ఒకే రోజు ఉండటంతో ఆసక్తి నెలకొంది. పట్టణ కేంద్రంలో దివంగత మంత్రి నూకల రామచంద్రరెడ్డి విగ్రహావిష్కరణ రేపు జరగనుంది. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గోనున్నారు. అదే పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో BRS మద్దతుతో గెలిచిన సర్పంచుల ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి KTR రానున్నారు. దీంతో కాంగ్రెస్, BRS శ్రేణులు వారికి స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.
Similar News
News January 7, 2026
ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదు: కొప్పుల ఈశ్వర్

జగిత్యాలలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2 సంవత్సరాల క్రితం తమ చేతుల మీదగా ప్రారంభించిన ఎస్సీ స్టడీ సర్కిల్ కేంద్రాన్ని బుధవారం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. కేసీఆర్ పాలనలో స్టడీ సర్కిల్ కేంద్రాలు విజయవంతంగా నడిచాయని, ప్రస్తుత ప్రభుత్వం వాటిని పట్టించుకోవడంలేదని విమర్శించారు. గతంలో స్టడీ సర్కిల్ ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనకు ఎంతో కృషి చేశాయని అన్నారు.
News January 7, 2026
పాలమూరు: ట్రాక్టర్ రూటర్ కిందపడి బాలుడి మృతి

NGKL జిల్లా పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లిలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన దుడ్డు మల్లేష్ కుమారుడు మిట్టు(3)ను పొలానికి తీసుకుని పొలానికి తీసుకెళ్లగా, అక్కడ ప్రమాదవశాత్తు ట్రాక్టర్ రూటర్ టైర్ కిందపడి మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారుడు కళ్లముందే విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న బాలుడి మరణాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.
News January 7, 2026
BCCIపై మొయిన్ అలీ పరోక్ష ఆరోపణలు

IPL నుంచి ముస్తాఫిజుర్‌ను <<18748860>>తప్పించడాన్ని<<>> ENG క్రికెటర్ మొయిన్ అలీ తప్పుబట్టారు. ‘ఎన్నో ఏళ్ల కష్టానికి అతనికి ఈ కాంట్రాక్టు దక్కింది. ఇలా తప్పించడంతో ఎక్కువగా నష్టం జరిగేది అతడికే. పాలిటిక్స్ క్రికెట్‌ను ప్రమాదంలో పడేస్తున్నాయి. దీనికి పరిష్కారం చూపాలి. ఇలాంటి సమస్యలపై AUS, ENG బోర్డులు ఎందుకు మాట్లాడవు. ICCని ఎవరు కంట్రోల్ చేస్తున్నారో అందరికీ తెలుసు’ అంటూ BCCIపై పరోక్ష ఆరోపణలు చేశారు.


