News December 26, 2025

మానేరు నదిపై హైలెవెల్ వంతెన.. తగ్గనున్న దూరభారం

image

కాటారం మండలం దామెరకుంట మంథని మండలం వెంకటాపూర్ గ్రామాల మధ్య మానేరు నదిపై హైలెవెల్ వంతెన నిర్మాణంతో అటవీ గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. తద్వారా కాలేశ్వరం వెళ్ళేందుకు మరో రహదారి సిద్ధమవడంతో పాటు 25 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. కాలేశ్వరం అభివృద్ధి, మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాల జాతీయ రహదారులకు అనుసంధానంగా మారుతుంది.

Similar News

News December 26, 2025

డబుల్ ఇంజిన్ సర్కారుతోనే రాష్ట్రాభివృద్ధి: కిషన్ రెడ్డి

image

TG: డబుల్ ఇంజిన్ సర్కారు వస్తేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేంద్ర నిధులతోనే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. పదేళ్లలో 2 ప్రభుత్వాలు కలిసి రూ.10 లక్షల కోట్లు అప్పు చేశాయని ఆదిలాబాద్‌లో జరిగిన సర్పంచ్‌ల ఆత్మీయ సమ్మేళనంలో ఆరోపించారు. దోచుకున్న ఆస్తులు కాపాడుకోవడానికి KCR కుటుంబం రోడ్డెక్కిందన్నారు. రేవంత్ పాలనలో రాష్ట్రం మరింత ఆగమైందని విమర్శించారు.

News December 26, 2025

ఇందిరమ్మ ఇళ్లలో జనగామ ముందంజ!

image

రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణంలో జనగామ జిల్లా ముందంజలో నిలిచిందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో రెండు విడతల్లో 5,834 ఇళ్లు మంజూరు కాగా, 5,206 ఇళ్లు నిర్మాణ దశలో, 33 ఇళ్లు పూర్తి అయ్యాయని చెప్పారు. వివిధ శాఖల అధికారుల భాగస్వామ్యంతో ఇది సాధ్యమైందని పేర్కొన్నారు.

News December 26, 2025

భువనగిరి: అడిషనల్ కలెక్టర్ బదిలీ

image

యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) వీరారెడ్డి బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన్ను తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించారు. వీరారెడ్డి సంవత్సరానికిపైగా భువనగిరిలో అదనపు కలెక్టర్‌గా పని చేశారు. భూ సమస్యల పరిష్కారంలో ఆయనకు విశేష అనుభవం ఉంది.