News August 10, 2025

మాన్‌సూన్‌ యాక్షన్‌ ప్లాన్‌లో సర్కారు విఫలం: ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి

image

మాన్‌సూన్‌ యాక్షన్‌ ప్లాన్‌ అమలులో సర్కార్ విఫలమైందని దుబ్బాక MLA కొత్త ప్రభాకర్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. వరద తొలగింపులకు కాంగ్రెస్ సర్కారం వింత చేష్టలు చేస్తుందన్నారు. నీరు పోవడానికి బ్రిడ్జిలకు డ్రిల్ చేయడం సిగ్గుచేటు అన్నారు. బ్రిడ్జిలకు డ్రిల్ చేస్తే బలానికి వాడే రబ్బర్లు తెగిపోయే ప్రమాదం ఉందన్నారు. కాంగ్రెస్ పాలనలో నగరవాసులు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

Similar News

News August 13, 2025

కరీంనగర్: ‘స్వచ్ఛ హరిత విద్యాలయ’ రేటింగ్‌లో పాల్గొనాలి

image

కరీంనగర్ జిల్లాలోని అన్ని పాఠశాలలు కేంద్ర విద్యా శాఖ నిర్వహిస్తున్న ‘స్వచ్ఛ హరిత విద్యాలయ రేటింగ్’లో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. స్వచ్ఛ హరిత విద్యాలయ నమోదు, బోధన, ఇంగ్లీష్ క్లబ్ వంటి అంశాలపై ఆమె మండల విద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. అన్ని పాఠశాలల్లో బుధవారం నుంచి ‘బుధవారం బోధన’ కార్యక్రమాన్ని అమలు చేయాలని కలెక్టర్ సూచించారు.

News August 13, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News August 13, 2025

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి: కలెక్టర్

image

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కథలాపూర్ మండలం భూషణరావుపేటలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. ఇండ్ల నిర్మాణాలు వేగంగా జరిగేలా లబ్ధిదారులను ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా నిర్మాణాలు పూర్తి చేయడానికి చొరవ చూపాలని కలెక్టర్ సూచించారు.