News July 5, 2025

మామడ మండలంలో అత్యధిక వర్షపాతం

image

గడచిన 24 గంటల్లో నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 30.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా మామడలో 6.2 మిల్లీమీటర్లు నమోదు కాగా, అత్యల్పంగా దిలావర్పూర్ 0.4 మిల్లీమీటర్లు నమోదైంది. కుబీర్‌లో 1.2, తానూర్ 2.2, ముధోల్ 1.2, లోకేశ్వరం 5.2, నిర్మల్ 1.8, నిర్మల్ రూరల్ 3.6, సోన్ 2.2, లక్ష్మణ్ చందా 1.8,, దస్తురాబాద్‌లో 1.2మి. మీగా రికార్డు అయింది.

Similar News

News July 5, 2025

ఖమ్మం: పరీక్షల్లో ఫెయిల్.. బీటెక్ విద్యార్థి SUICIDE

image

పరీక్షలో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో బీటెక్ విద్యార్థి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన ముదిగొండ మండలంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. మండలంలోని వల్లాపురానికి చెందిన ఇండేమందల యశ్వంత్(19) బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల పరీక్షలు రాసి కిష్టాపురంలోని తన అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నాడు. పరీక్షలో ఫెయిల్ అవ్వడంతో మనస్తాపం చెంది బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.

News July 5, 2025

MDK: సిగాచి పరిశ్రమ ఘటన.. 40కి చేరిన మృతుల సంఖ్య

image

సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 40కి చేరింది. తాజాగా ధ్రువ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మున్మున్ అనే వ్యక్తి మృతి చెందారు. ఈ ప్రమాద ఘటనలో మరో ముగ్గురి మృతదేహాలను అధికారులు గుర్తించారు. వీరిలో ఇద్దరు బీహర్, ఒకరు ఒడిశాకు చెందిన కార్మికులుగా నిర్ధారించారు. ఇప్పటివరకు 36 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు అధికారులు వెల్లడించారు.

News July 5, 2025

మెడికల్ రిక్రూట్‌మెంట్: మెరిట్ లిస్ట్ విడుదల

image

TG: 156 ఆయుష్ మెడికల్ ఆఫీసర్, MNJ ఆస్పత్రిలో 45 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల <>మెరిట్ లిస్ట్<<>> విడుదలైంది. ఈ పోస్టుల భర్తీతో ఆయుష్ వైద్య సేవలు మరింత మెరుగు అవుతాయని మంత్రి దామోదర రాజనర్సింహ హర్షం వ్యక్తం చేశారు. క్యాన్సర్ పేషెంట్ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో క్యాన్సర్ వైద్య సేవలను విస్తరిస్తున్నామని తెలిపారు. జిల్లాలకు కూడా ప్రభుత్వ క్యాన్సర్ వైద్య సేవలను అందుబాటులోకి తెస్తున్నామని వివరించారు.