News February 20, 2025

మామడ: మహిళ దారుణ హత్య

image

NZBజిల్లా ఏర్గట్ల మండలం నాగేంద్రనగర్‌కు చెందిన మహిళ హత్యకు గురైంది. పోలీసుల ప్రకారం.. మహిళకు భర్తతో విడాకులై ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలో వెంకటేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆమెపై అనుమానం పెంచుకున్న నిందితుడు ఆమెను జనవరి 21న నిర్మల్ జిల్లా మామడకు రప్పించాడు. దిమ్మదుర్తి, నల్దుర్తి మార్గంలోని అడవిలోకి తీసుకెళ్లి హత్య చేశాడు. నిందితుడిని రిమాండ్‌కి తరలించినట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు.

Similar News

News January 27, 2026

తిరుపతి జిల్లాలో విషాదం.. ఇద్దరి మృతి

image

తిరుపతి నెహ్రూనగర్‌కు చెందిన షేక్ అఫ్రిద్ తన కుమార్తె పుట్రెంటుకులు తీయించడానికి 15మంది బంధువులతో చిట్వేల్‌లోని దర్గాకు శనివారం వెళ్లారు. ఆదివారం కార్యక్రమం ముగిశాక కొందరు తిరుపతికి వచ్చేశారు. అక్కడే ఉన్న నూరుల్లా(26), తన మేనల్లుడు ఆసిస్‌(14)తో కలిసి సోమవారం దర్గాకు సమీపంలోని కాలువలో ఈతకు వెళ్లారు. ఆసిస్ నీటిలో మునిగిపోతుండగా కాపాడేందుకు నూరుల్లా ప్రయత్నించాడు. ఈత రాకపోవడంతో ఇద్దరూ చనిపోయారు.

News January 27, 2026

ఫైబర్ ఎందుకు తీసుకోవాలంటే..

image

మ‌న‌ల్ని ఆరోగ్యంగా ఉంచే పోషకాల్లో ఫైబర్ ఒకటి. ఇందులో సాల్యుబుల్ ఫైబ‌ర్, ఇన్ సాల్యుబుల్ ఫైబ‌ర్‌ అనే రకాలుంటాయి. దీనివల్ల జీర్ణ వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగయ్యి గ్యాస్‌, అసిడిటీ, ఉబ్బ‌రం, మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతాయి. కొలెస్ట్రాల్‌, బీపీ, షుగర్ నియంత్ర‌ణ‌లో ఉంటాయి. పురుషులకు రోజుకు 30 గ్రా, స్త్రీల‌కు 25 గ్రా ఫైబర్ అవ‌స‌రం. 2-5 ఏళ్ల పిల్ల‌ల‌కు 15 గ్రా, 5-11 ఏళ్లు పిల్లలకు 20 గ్రా వ‌ర‌కు రోజూ ఫైబ‌ర్ కావాలి.

News January 27, 2026

నల్గొండలో రూ.8 కోట్లతో స్కూల్ నిర్మాణం.. నేడే ప్రారంభం

image

కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ సుమారు రూ.8 కోట్లతో నిర్మించిన బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాల అత్యాధునిక భవనాన్ని మంత్రి వెంకటరెడ్డి నేడు ప్రారంభించనున్నారు. ఇక్కడ రాష్ట్రంలోనే తొలిసారిగా ‘వాల్డార్ఫ్’ విద్యా విధానాన్ని అమలు చేస్తున్నారు. డిజిటల్ తరగతులు, కంప్యూటర్ ల్యాబ్స్, లిఫ్ట్ సౌకర్యం వంటి కార్పొరేట్ స్థాయి వసతులు ఇక్కడ ఉన్నాయి. విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందే విధంగా విద్యాబోధన చేయనున్నారు.