News December 26, 2025
మామిడిలో మంచి పూతకు నిపుణుల సూచనలు

మామిడిలో పూమొగ్గలను ఉత్తేజపరిచి త్వరగా పూత తెప్పించడానికి, ఆడపూల శాతం పెంచడానికి లీటరు నీటికి పొటాషియం నైట్రేట్ 10గ్రా., లీటరు నీటికి బోరాన్ 2గ్రా. కలిపి పిచికారీ చేయాలి. పూమొగ్గ దశలో తేనెమంచు పురుగు నివారణకు లీటరు నీటికి క్లోరిపైరిఫాస్ 2.5ml కలిపి పూత మొదలయ్యే సమయం, పిందెలు తయారయ్యే సమయంలో పూత, ఆకులపైనే కాకుండా మొదళ్లపైన, కొమ్మలపైన కూడా పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
Similar News
News January 1, 2026
ప్రసాదంపై తప్పుడు వీడియో… భక్తులపై కేసు

AP: ప్రసాదంలో నత్తగుల్ల వచ్చిందని వీడియో పెట్టిన ఇద్దరు భక్తులపై సింహాచలం ఆలయ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. DEC 29న ఆ భక్తులు ప్రసాదాన్ని బయటకు తీసుకెళ్లి తిరిగి తెచ్చారని, ఆ సమయంలో వారు కల్తీ చేసి ఉంటారని పేర్కొన్నారు. ‘ఆరోజు 15వేల పులిహోర పొట్లాలు అమ్మాం. ఇలాంటి ఫిర్యాదు గతంలోనూ ఎవరినుంచీ రాలేదు. ప్రసాదం తయారీలో నిపుణులైన వంటవారు అనేక జాగ్రత్తలు తీసుకుంటారు’ అని పేర్కొన్నారు.
News January 1, 2026
ప్రెగ్నెన్సీలో కాళ్లవాపులు ఎక్కువగా ఉంటే?

నెలలు నిండే కొద్దీ గర్భిణులకు కాళ్ల వాపులు వస్తాయి. ఇవి తగ్గాలంటే ఎక్కువసేపు కూర్చోకుండా అటూఇటూ తిరగాలి. పాదాల కింద దిండు పెట్టుకొని విశ్రాంతి తీసుకోవాలి. ఎక్కువసేపు కూర్చొంటే కాళ్లను పైకి పెట్టుకోవాలి. వేడిగా ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలి. బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకోవాలి. బరువు పెరగకుండా ఉండాలి. నీరు ఎక్కువగా తీసుకోవాలి. ఉప్పు, తీపి తగ్గించాలి. సమతులాహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
News January 1, 2026
కర్రపెండలంలో జింక్ లోప లక్షణాలు – నివారణ

కర్రపెండలంలో మొక్కలో జింక్ లోపం వల్ల ఆకులు సన్నగా, పసుపుగా మారి పైకి వంకరగా ఉంటాయి. పెరుగుతున్న లేత మొక్క భాగంపై ప్రభావం ఎక్కువగా ఉండి, పెరుగుదల తగ్గుతుంది. లేత ఆకులలో ఈనెల ముఖ్య భాగం పసుపు రంగులోకి మారుతుంది. లోప నివారణకు 5KGల జింక్ సల్ఫేట్ భూమిలో వేసి కప్పాలి. 1-2% జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని 3-4 సార్లు పిచికారీ చేయాలి. ముచ్చెలను 2-4% జింక్ సల్ఫేట్ ద్రావణంలో 15 నిమిషాలు ముంచిన తర్వాత నాటుకోవాలి.


