News December 30, 2025

మామునూర్ ఎయిర్‌పోర్టుకు మార్చిలో శంకుస్థాపన!

image

వరంగల్ మామునూర్ ఎయిర్‌పోర్టుకు మార్చిలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలకు ప్రధాని రానున్నారు. మహబూబాబాద్‌లోని రైల్వే పీవోహెచ్, ములుగులో ట్రైబల్ యూనివర్సిటీతో పాటు ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేయనున్నట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి. మరోపక్క శంకుస్థాపన చేసిన 9 నెలల్లోనే విమానాలను నడిపేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

Similar News

News February 18, 2026

ఏప్రిల్ 19 నుంచి చార్‌ధామ్ యాత్ర.. రిజిస్ట్రేషన్‌కు ఫీజు!

image

పవిత్ర చార్‌ధామ్ యాత్ర ఏప్రిల్ 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ ఏడాది రిజిస్ట్రేషన్‌కు మినిమమ్ ఫీజు వసూలు చేయనున్నారు. ఫేక్ రిజిస్ట్రేషన్లను నిరోధించేందుకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒకట్రెండు రోజుల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. ఫీజు ఎంతనేది ఇంకా నిర్ణయించాల్సి ఉంది. ఏప్రిల్ 19న గంగోత్రి, యమునోత్రి, 22న కేదార్‌నాథ్, 23న బద్రీనాథ్ తెరుచుకోనున్నాయి.

News February 18, 2026

అన్నమయ్య: హాల్ టికెట్ల విడుదల ఎప్పుడంటే?

image

అన్నమయ్య జిల్లాలో మార్చి 16వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. సంబంధిత హాల్ టికెట్లు మార్చి మొదటి వారంలో విడుదల అవుతాయని DEO సుబ్రహ్మణ్యం తెలిపారు. బోర్డ్ వెబ్‌సైట్, పాఠశాల లాగిన్‌లు, LEAP యాప్, వాట్సాప్ ద్వారా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. పాఠశాలలు విద్యార్థుల వివరాలను సరిపోల్చి పరిశీలించాలని.. పొరపాట్ల సవరణకు UDISE విండో మార్చి 31వ తేదీ వరకు ఉంటుందన్నారు.

News February 18, 2026

వంగలో ఆకుమాడు తెగులు – నివారణ

image

వంగ పంటలో నారును పొలంలో నాటిన తర్వాత 30 రోజులకు ఆకుమాడు తెగులు ఆశిస్తుంది. దీని వల్ల ఆకులు మాడిపోయినట్లుగా కనిపిస్తాయి. అలాగే గోధుమ రంగు మచ్చలు ఏర్పడి ఆకులు పసుపు రంగుకు మారి, వాడి రాలిపోతాయి. తేమతో కూడిన చల్లని వాతావరణంలో దీని వ్యాప్తి ఎక్కువగా కనిపిస్తుంది. ఆకుమాడు తెగులు నివారణకు లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా. లేదా కార్బండిజం 1గ్రా. కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి.