News April 18, 2025

మామునూర్ ఎయిర్‌పోర్టు.. నెక్స్ట్ ఏంటి?

image

మామునూర్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం పచ్చ జెండా ఊపిన విషయం తెలిసిందే. ఇందుకు 949 ఎకరాలు అవసరం కాగా 696 ఎకరాలు సేకరించారు. మరో 253 ఎకరాల కోసం 3 గ్రామాలను ఒప్పించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అక్కడి భూముల ధరలు అమాంతం పెరగడంతో ఎకరాకు రూ.5కోట్లు ఇవ్వాలనే డిమాండ్ వచ్చింది. ఎయిర్‌పోర్టు విషయం పట్టాలు తప్పినట్లవడంతో అధికారులు సమస్య క్లియర్ చేసి త్వరగా నిర్మించాలని జిల్లా వాసులు కోరుతున్నారు. మీ కామెంట్

Similar News

News April 19, 2025

స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర ర్యాలీలో సత్యసాయి జిల్లా కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్రపై ర్యాలీ నిర్వహించారు. శనివారం ఉదయం పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నుంచి, కూడలి వరకు అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పుట్టపర్తి మున్సిపల్ ఛైర్మన్ తుంగ ఓబుళపతి, తదితరులు పాల్గొన్నారు.

News April 19, 2025

ఉమ్మడి తూ.గో.లో 1278 పోస్టులు

image

నిరుద్యోగులు ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం తర్వలో ప్రకటించనుంది. నోటిఫికేషన్ వచ్చిన 45 రోజుల్లో పరీక్షలు పెట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరిలో 1278 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, ప్రత్యేక విద్యకు సంబంధించి 151 స్కూల్ అసిస్టెంట్లు, 137ఎస్జీటీలు ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. వయోపరిమితిని కూడా 44 సంవత్సరాలకు పెంచారు.

News April 19, 2025

జైళ్లలో ఖైదీల కోసం ప్రత్యేక ‘సెక్స్ రూమ్స్’

image

ఇటలీలో ఖైదీల లైంగిక కలయిక కోసం అధికారులు జైళ్లలో ప్రత్యేకంగా శృంగార గదులు ఏర్పాటు చేస్తున్నారు. 2 గంటలపాటు తమ భార్యలు, ప్రియురాళ్లతో వీరు ఏకాంతంగా గడపవచ్చు. ఆ ప్రదేశంలో గార్డుల పర్యవేక్షణ కూడా ఉండదు. కాగా ములాఖత్‌కు వచ్చే భాగస్వాములతో ఖైదీలకు శృంగారం జరిపే హక్కు ఉంటుందని అక్కడి అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీంతో అక్కడి ఉంబ్రియా ప్రాంతంలోని జైలులో తొలి సెక్స్ గది ఏర్పాటు చేశారు.

error: Content is protected !!