News January 1, 2026
మారింది డేటే.. ‘మిరాకిల్’ మీ చేతుల్లోనే

క్యాలెండర్‌లో మారింది డేట్ మాత్రమే. మీ జీవితం కూడా మారాలని కోరుకుంటున్నారా? అది మీ చేతుల్లోనే ఉంది. బలమైన ఆశయం, సంకల్పం, శ్రద్ధతో పని చేస్తే ఆలస్యమైనా విజయం మిమ్మల్ని చేరక తప్పదు. ఇయర్ మారింది.. మన టైమ్ కూడా మారుతుందని ఊరికే ఉంటే ఇంకో ఇయర్ వచ్చినా డేట్‌లో మార్పు తప్ప జీవితంలో కూర్పు ఉండదు. సో.. నేర్పుగా వ్యవహరిస్తే ‘మిరాకిల్’ మీ చేతుల్లోనే..
ALL THE BEST
Similar News
News January 1, 2026
కర్రపెండలంలో జింక్ లోప లక్షణాలు – నివారణ

కర్రపెండలంలో మొక్కలో జింక్ లోపం వల్ల ఆకులు సన్నగా, పసుపుగా మారి పైకి వంకరగా ఉంటాయి. పెరుగుతున్న లేత మొక్క భాగంపై ప్రభావం ఎక్కువగా ఉండి, పెరుగుదల తగ్గుతుంది. లేత ఆకులలో ఈనెల ముఖ్య భాగం పసుపు రంగులోకి మారుతుంది. లోప నివారణకు 5KGల జింక్ సల్ఫేట్ భూమిలో వేసి కప్పాలి. 1-2% జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని 3-4 సార్లు పిచికారీ చేయాలి. ముచ్చెలను 2-4% జింక్ సల్ఫేట్ ద్రావణంలో 15 నిమిషాలు ముంచిన తర్వాత నాటుకోవాలి.
News January 1, 2026
రూ.3వేల కోట్ల విడుదలపై కేంద్రం షరతులు

TG: ఎన్నికలు జాప్యం కావడంతో పంచాయతీలకు రావలసిన ₹3000 CR ఫైనాన్స్ కమిషన్ నిధులను కేంద్రం 2023 నుంచి నిలిపి వేసింది. ఇటీవల ఎన్నికలు పూర్తి చేసిన ప్రభుత్వం వివరాలు సమర్పించి నిధులు విడుదల చేయాలని కోరింది. అయితే గతంలో గ్రామీణాభివృద్ధి శాఖ ఇచ్చిన నిధుల వినియోగంపై ధ్రువపత్రాలు సమర్పించాలని కేంద్రం తాజాగా కొర్రీ వేసింది. దీంతో నిధుల సత్వర విడుదలకు కేంద్ర మంత్రిని కలవాలని మంత్రి సీతక్క నిర్ణయించారు.
News January 1, 2026
H-1B వీసా జాప్యం.. అమెజాన్ ఉద్యోగులకు ఊరట

అమెరికాలో H-1B వీసా ప్రాసెసింగ్ జాప్యం వల్ల భారత్‌లో చిక్కుకుపోయిన తమ ఉద్యోగులకు అమెజాన్ ఊరటనిచ్చింది. వీరు 2026 మార్చి 2 వరకు ఇంటి నుంచే పనిచేసేందుకు అనుమతించింది. అయితే వీరు కోడింగ్, క్లయింట్లతో మాట్లాడటం, కీలక నిర్ణయాలు తీసుకోవడం వంటి పనులు చేయొద్దని కఠిన ఆంక్షలు విధించింది. అమెరికా కొత్తగా తెచ్చిన సోషల్ మీడియా స్క్రీనింగ్ నిబంధనల వల్ల వీసా ఇంటర్వ్యూలు వాయిదా పడటంతో ఈ నిర్ణయం తీసుకుంది.


