News March 23, 2025

మారుమూల ప్రాంతాలకు తాగునీటిని అందించాలి: ASF కలెక్టర్

image

మిషన్ భగీరథ పథకం ద్వారా మారుమూల ప్రాంతాలకు శుద్ధమైన తాగునీటిని అందించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. శనివారం ఆసిఫాబాద్ మండలంలోని తుంపెల్లి గ్రామంలో మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ జరుగుతున్న నీటి సరఫరా ప్రక్రియను అదనపు కలెక్టర్ దీపక్ తివారి, మిషన్ భగీరథ ఇంజినీర్లు, గ్రామపంచాయతీ కార్యదర్శులతో కలిసి పరిశీలించారు. వేసవి కాలంలో ప్రజలకు నీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.

Similar News

News July 5, 2025

కామారెడ్డి జిల్లాలో నాట్లు షురూ.. లక్ష్యం ఎంతంటే?

image

కామారెడ్డి జిల్లాలో ఖరీఫ్ సీజన్ వరి నాట్లు మొదలయ్యాయి. ఈఏడాది 3.18 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుందని అధికారులు అంచనా వేశారు. గతేడాదితో పోలిస్తే ఈసారి వరి సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి విత్తనాలు, ఎరువుల లభ్యతపై అధికారులు దృష్టి సారించారు. రైతులకు సకాలంలో అవసరమైన సలహాలు, సూచనలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని DAO తిరుమల ప్రసాద్ తెలిపారు.

News July 5, 2025

NLG: 8 నుంచి పోస్టల్‌లో కొత్త సాఫ్ట్వేర్

image

పోస్టల్ డివిజన్లోని NLG, యదాద్రి BNG జిల్లాల్లో జూలై 8 నుంచి కొత్త సాఫ్ట్వేర్ అందుబాటులోకి రానున్నట్లు సూపరింటెండెంట్ కె.రఘునాథస్వామి తెలిపారు. రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్టు కింద NLG డివిజన్లోని 2 హెడ్ ఆఫీసులు, 37 సబ్ పోస్టాఫీస్‌లు, 392 పోస్టాఫీస్‌లు, 353 బ్రాంచ్ ఆఫీసుల్లో నూతనంగా ఐటీ 2.0 అప్లికేషన్ ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు.

News July 5, 2025

రైతులకు శుభవార్త.. ఆగస్టు నాటికి కొత్త పాస్ పుస్తకాలు

image

AP: రీసర్వే పూర్తైన గ్రామాల్లో ఆగస్టు నాటికి రైతులకు కొత్త పాస్ పుస్తకాలు అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రతి పాస్‌బుక్‌పై QR కోడ్‌తో పాటు ఆధార్ ఆధారంగా తమ సొంత భూమి వివరాలు తెలుసుకునేలా చర్యలు సూచించారు. 2027 డిసెంబర్ నాటికి భూముల రీసర్వే పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు. అలాగే అక్టోబర్ నాటికి ప్రతి ఒక్కరికీ శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు పంపిణీ చేయాలని సూచించారు.