News March 30, 2025

మారు తల్లి కొట్టడంతో బాలుడి మృతి, మరో బాలుడికి గాయాలు  

image

పల్నాడు జిల్లా ఎడ్లపాడు(మ) కొండవీడు వద్ద గొల్లపాలెంలో కవల పిల్లల్ని మారు తల్లి కొట్టడంతో చనిపోయిన ఘటన చోటుచేసుకుంది. కొండవీడుకి చెందిన కంచర్ల సాగర్, లక్ష్మి అనే మహిళను 2వ వివాహం చేసుకున్నాడు. సాగర్ మొదటి భార్యకి ఇద్దరు కవలలు పుట్టగా, ఆమె అనారోగ్యంతో చనిపోయింది. రెండడో భార్య లక్ష్మి మొదటి భార్య పిల్లలను.. ఓ బాబుని గోడకేసి కొట్టడం వల్ల తల పగిలి అక్కడకక్కడే చనిపోగా, మరో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.  

Similar News

News April 1, 2025

‘దేవర’ సినిమాకు మరో అవార్డు

image

ఉగాది’ సందర్భంగా చెన్నైలో శ్రీ కళా సుధ తెలుగు అసోసియేషన్ ఇచ్చిన అవార్డుల్లో దేవరను బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డు వరించింది. ఈ విషయాన్ని దేవర ఫొటోగ్రఫీ డైరెక్టర్ రత్నవేలు ట్వీట్ చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ సినిమా భారీ విజయాన్ని అందుకోగా ఇటీవలే జపాన్‌లో రిలీజైన విషయం తెలిసిందే. కాగా, ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ నటిస్తోన్న ‘పెద్ది’ సినిమాకు DOPగా పనిచేస్తున్నారు.

News April 1, 2025

దుర్గి: పెన్షన్‌ పంపిణీ చేసిన కలెక్టర్  

image

దుర్గి మండలంలో సామాజిక పెన్షన్‌ను కలెక్టర్ అరుణ్ బాబు స్వయంగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మంగళవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సామాజిక పెన్షన్ పంపిణిలో భాగంగా దుర్గి మండల కేంద్రంలో పెన్షన్‌లను కలెక్టర్ అరుణ్ బాబు లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి నెల సక్రమంగా పెన్షన్సకాలంలో అందుతుందా అని అడిగి తెలుసుకున్నారు.  

News April 1, 2025

కర్నూలు: పరీక్షా కేంద్రంలో కలెక్టర్ తనిఖీ

image

పదో తరగతి పరీక్షల్లో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా కర్నూలు నగరంలోని దామోదరం సంజీవయ్య, స్మారక మున్సిపల్ హై స్కూల్ పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ.. విద్యార్థులకు మెరుగైన సదుపాయాలను కల్పించడంలో అధికారులు సఫలమయ్యారని అన్నారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు చూసుకోవాలని ఆదేశించారు.

error: Content is protected !!