News January 7, 2026

మారేడుమిల్లి: పొట్టకూటి కోసం వచ్చి.. యాక్సిడెంట్‌లో మృతి

image

ఊరూరా తిరుగుతూ రగ్గులు అమ్ముకునే దర్బార్ సింగ్ మంగళవారం మారేడుమిల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. సీఐ ప్రసాద్ తెలిపిన వివరాలు ప్రకారం.. మధ్యప్రదేశ్‌కు చెందిన అతడు బైక్‌పై ప్రయాణిస్తుండగా అదుపు తప్పి చెట్టును ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు మారేడుమిల్లి ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం రంపచోడవరం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడన్నారు.

Similar News

News February 8, 2026

సిరిసిల్ల: మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం

image

మున్సిపల్ ఎన్నికల కోడ్ విడుదలైన నేపథ్యంలో ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు పక్కా కార్యాచరణ రూపొందించామని ఆమె తెలిపారు. పోలింగ్, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాల వద్ద ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశారు. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేలా అధికారులకు దిశానిర్దేశం చేశారు.

News February 8, 2026

NZB: రేపాటి నుంచి మద్యం దుకాణాలు బంద్

image

మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి ఓటింగ్ ముగిసే వరకు మద్యం దుకాణాలు బంద్ చేయాలని NZB జిల్లా మద్య నిషేధ, అబ్కారీ అధికారి K.మల్లారెడ్డి ఆదేశించారు. ఈ మేరకు NZB మున్సిపల్ కార్పొరేషన్, బోధన్, ఆర్మూర్, భీమ్‌గల్ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వైన్ షాపులు, బార్లు, కల్లు డిపోలు, కల్లు దుకాణాలు, ఆర్మీ క్యాంటీన్, హరిత ఇందూర్ మూసి వేయాలన్నారు.

News February 8, 2026

రేపు పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లీనిక్ సేవలు: కలెక్టర్

image

గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం జరిగే పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లీనిక్ సేవలను ప్రజలు సద్వినియోగంచేసుకోవాలని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా సూచించారు. https://Meekosam.ap.gov.inవెబ్ సైట్‌లోనూ అర్జీలు సమర్పించవచ్చని, డయల్ 1100కి ఫోన్ చేసి అర్జీల స్థితిని తెలుసుకోవచ్చని చెప్పారు. మండలాల వారీగా రెవెన్యూ క్లీనిక్ కౌంటర్లు అందుబాటులో ఉంటాయని అన్నారు. అక్కడ రెవెన్యూ సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చన్నారు.