News March 27, 2025
మార్కాపురం: ఇద్దరు యువకుల మృతి

పల్నాడు జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. అర్ధవీడు(M) నారాయణపల్లికి చెందిన ఆర్మీ జవాన్ ఇంద్రసేనారెడ్డి(27), మార్కాపురం(M) మిట్టమీదపల్లికి చెందిన కాశిరెడ్డి(29) నాగార్జునసాగర్‌లోని బంధువుల ఇంటికి బైకుపై వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తుండగా మాచర్ల(M) కొత్తపల్లి జంక్షన్ వద్ద డీసీఎం వీరిని ఢీకొట్టింది. ఇంద్రసేనారెడ్డి అక్కడికక్కడే చనిపోగా.. కాశిరెడ్డి ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయాడు.
Similar News
News December 14, 2025
నర్సాపూర్‌కు వందేభారత్.. ఒంగోలులో టైమింగ్స్ ఇవే.!

చెన్నై–విజయవాడ వెళ్లే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (20677/20678)ను నరసాపూర్ వరకు పొడిగించారు. ఈ రైలుకు ఒంగోలు స్టేషన్‌లో స్టాపింగ్ ఉంది. చెన్నై నుంచి ఉ. 5.30కి బయలుదేరి ఒంగోలుకు ఉదయం 10.09కి చేరి 10.10కి బయలుదేరుతుంది. నరసాపూర్ నుంచి మధ్యాహ్నం 2.50కి బయలుదేరే రైలు, ఒంగోలుకు సాయంత్రం 6.29కి చేరి 6.30కి బయలుదేరుతుంది. డిసెంబర్ 15 నుంచి నరసాపూర్ నుంచి, డిసెంబర్ 17 నుంచి చెన్నై నుంచి ప్రారంభం కానుంది.
News December 14, 2025
తెలంగాణలో పొదిలి, మార్కాపురం వాసులు మృతి.!

ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు ఈతకు వెళ్లి ఊపిరాడక మృతి చెందిన ఘటన తెలంగాణలో జరిగింది. పొదిలికి చెందిన సాయి ప్రసాద్, మార్కాపురంకి చెందిన రవితేజ, కంభంకి చెందిన వంశీకృష్ణలు నిజామాబాద్‌లో బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే వీరు శుక్రవారం రాత్రి రామడుగు ప్రాజెక్టు వద్దకు వెళ్లి వాగులో దిగారు. ఒక్కసారిగా ఊపిరాడక ప్రసాద్, రవితేజ మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News December 14, 2025
నర్సాపూర్‌కు వందేభారత్.. ఒంగోలులో టైమింగ్స్ ఇవే.!

చెన్నై–విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (20677/20678)ను నరసాపూర్ వరకు పొడిగించారు. ఈ రైలుకు ఒంగోలు స్టేషన్‌లో స్టాపింగ్ ఉంది. చెన్నై నుంచి ఉదయం 5.30కి బయలుదేరే ఈ రైలు ఒంగోలుకు ఉదయం 10.09కి చేరి 10.10కి బయలుదేరుతుంది. నరసాపూర్ నుంచి మధ్యాహ్నం 2.50కి బయలుదేరే రైలు, ఒంగోలుకు సాయంత్రం 6.29కి చేరి 6.30కి బయలుదేరుతుంది. డిసెంబర్ 15 నుంచి నరసాపూర్ నుంచి, డిసెంబర్ 17 నుంచి చెన్నై నుంచి ప్రారంభం కానుంది.


