News April 28, 2024
మార్కాపురం: కందులపై కేసు నమోదు

మార్కాపురం టీడీపీ అభ్యర్థి కందుల నారాయణరెడ్డిపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేసినట్లుగా మార్కాపురం పట్టణ ఎస్ఐ అబ్దుల్ రెహమాన్ శనివారం తెలిపారు. ఈనెల 25వ తేదీన నామినేషన్ సందర్భంగా కళాశాల రోడ్డులోని ఓ టీడీపీ నేత వెంచర్ లో అనుమతి లేకుండా కార్యకర్తలకు భోజనాలు ఏర్పాటు చేశారు. దీంతో పాటు వివిధ అంశాలపై ఎన్నికల అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు.
Similar News
News December 12, 2025
ప్రకాశం: ఈనెల 13, 14న టీచర్లకు క్రీడలు.!

ప్రకాశం జిల్లాలోని మూడు డివిజన్ల పరిధిలో ఈనెల 13, 14న ఉపాధ్యాయుల క్రీడలు నిర్వహించనున్నట్లు డీఈఓ రేణుక తెలిపారు. మహిళా ఉపాధ్యాయులకు త్రో బాల్ టోర్నమెంట్ నిర్వహిస్తామని, ఉపాధ్యాయులు పాల్గొనాలని కోరారు. ఒంగోలులోని పీవీఆర్ హైస్కూల్, మార్కాపురంలోని హైస్కూల్, కనిగిరిలోని డిగ్రీ కళాశాల ఆవరణంలో క్రీడలు జరుగుతాయన్నారు.
News December 12, 2025
ప్రకాశం: మతిస్థిమితం లేని మహిళపై అత్యాచారం.. పదేళ్ల జైలు శిక్ష.!

మతిస్థిమితం లేని మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ ఒంగోలు 2వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి గురువారం తీర్పునిచ్చారు. ఒంగోలుకు చెందిన నారాయణ మతిస్థిమితంలేని మహిళపై అత్యాచారానికి పాల్పడినట్టు 2021లో ఒంగోలు మహిళా పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు అందింది. విచారణ అనంతరం న్యాయస్థానం నేడు నిందితుడికి శిక్ష విధించింది. పోలీసులను SP హర్షవర్ధన్ రాజు అభినందించారు.
News December 12, 2025
ప్రకాశం ప్రజలకు.. సైబర్ నేరాలపై కీలక సూచన.!

వాట్సాప్‌లలో వచ్చే క్యూ-ఆర్ కోడ్‌ల పట్ల ప్రకాశం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రకాశం SP కార్యాలయం సూచించింది. SP హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు.. సైబర్ నేరాల నియంత్రణకై IT విభాగం పోలీసులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు గురువారం క్యూఆర్ కోడ్ గురించి కీలక సూచన చేశారు. అపరిచిత వ్యక్తులు పంపించే క్యూఆర్ కోడ్‌ల పట్ల అప్రమత్తంగా లేకుంటే, సైబర్ నేరానికి గురయ్యే అవకాశం ఉందని సూచించారు.


