News March 16, 2026

మార్కాపురం కలెక్టరేట్‌లో గ్రీవెన్స్ డే: జేసీ

image

మార్కాపురం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో రాసి అధికారులకు సమర్పించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అర్జీలపై అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకుంటారని భరోసా ఇచ్చారు.

Similar News

News April 14, 2026

మార్కాపురంలో అగ్నిమాపక వారోత్సవాలు

image

మార్కాపురంలో అగ్నిమాపక వారోత్సవాలను జిల్లా కలెక్టర్ విజయ సునీత మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదంలో అసువులు బాసిన అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఫైర్ ఎక్యూప్మెంట్ స్టాల్‌ను, పాంప్లెట్లు, పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. అగ్ని ప్రమాదాల పట్ల ప్రజల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఫైర్ ఆఫీసర్ ఆర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

News April 14, 2026

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

image

ఒంగోలు మండలం వెంగమక్కపాలెం గ్రామ సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే.. టిప్పర్ రివర్స్ చేసే క్రమంలో ప్రమాదవశాత్తు TVS ఎక్సెల్‌పై వెళ్తున్న వృద్ధుడిని ఢీకొంది. ఈ ప్రమాదంలో వృద్ధుడు లారీ చెక్రాలకింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు టంగుటూరు మండలం ఎర్రజర్ల ఎస్సీ కాలనీకి చెందిన పేరయ్యగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.