News January 5, 2026
మార్కాపురం కొత్త జిల్లా.. కాకమీదున్న పాలిటిక్స్!

మార్కాపురం జిల్లాలో పొలిటికల్ హీట్ కనిపిస్తోంది. జిల్లాలో అంతర్భాగమైన Y పాలెం పాలిటిక్స్ హీట్ పీక్స్‌కు చేరింది. MLA తాటిపర్తి చంద్రశేఖర్ ఇటీవల జడ్పీ సమావేశంలో ప్రొటోకాల్ విషయమై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఎమ్మెల్యే విమర్శలపై టీడీపీ ఇన్‌ఛార్జ్ ఎరిక్షన్ బాబు ఫైర్ అయ్యారు. ఆయన ఇన్‌ఛార్జ్‌గా ఉన్న సమయంలో ప్రొటోకాల్ గుర్తులేదా అంటూ ఎరిక్షన్ బాబు ప్రశ్నించారు. ఇలా వీరి మధ్య విమర్శల జోరు ఊపందుకుంది.
Similar News
News February 8, 2026
మార్కాపురం: పలకల క్వారీ గుంతలో పడి విద్యార్థి మృతి

మార్కాపురం మండలం రాయవరం గ్రామ సమీపంలోని పలకల క్వారీలో సరదాగా ఈత కొట్టడానికి వెళ్లిన ముగ్గురు విద్యార్థులలో ఒక విద్యార్థి గల్లంతయ్యాడు. మిగిలిన విద్యార్థులు భయపడి రోడ్డుపై వెళ్తున్న వారిని పిలిచి విషయం చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని 9వ తరగతి చదువుతున్న విద్యార్థి ఏసుబాబు మృతదేహాన్ని బయటకు తీశారు.
News February 8, 2026
వైఎస్ జగన్‌ను కలిసిన ఒంగోలు ఎంపీ మాగుంట

చెన్నైలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల వివాహం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైస్ జగన్ మోహన్ రెడ్డి, మాగుంట ఇరువురూ పలకరించుకున్నారు. మాగుంటను జగన్ ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ భేటీలో రాజకీయాలు ఏమి లేవని సమాచారం.
News February 8, 2026
పాకల బీచ్ ఫెస్టివల్ కు రానున్న ప్రముఖ యాంకర్

సింగరాయకొండ మండలం పాకల బీచ్ వద్ద ఈనెల 14, 15వ తేదీలలో జరగనున్న బీచ్ ఫెస్టివల్‌కు ప్రముఖ యాంకర్ సుమ రానున్నారు. ఇదే విషయాన్ని మంత్రి స్వామి సైతం వెల్లడించారు. రెండు రోజులపాటు ఘనంగా నిర్వహించే ఫెస్టివల్‌కు పలువురు కమెడియన్లు సైతం రానున్నారు. ప్రతిష్ఠాత్మకంగా బీచ్ ఫెస్టివల్ నిర్వహించనున్న నేపథ్యంలో ఇక్కడ నిర్వహించే కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకోనున్నాయి.


