News December 31, 2025

మార్కాపురం జిల్లాకు సిబ్బంది కేటాయింపు

image

మార్కాపురం నూతన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగులు, సిబ్బందిని నియమిస్తూ ఇన్‌ఛార్జ్ జిల్లా కలెక్టర్ రాజబాబు ఉత్తర్వులు జారీ చేశారు. సూపరింటెండెంట్ అడ్మిన్ సెక్షన్ – 2, సూపరింటెండెంట్ మెజిస్ట్రేరియల్ సెక్షన్1, సూపరింటెండెంట్ కోఆర్డినేషన్ సెక్షన్ 2, సూపరింటెండెంట్ ల్యాండ్స్ 1 సెక్షన్-2, ల్యాండ్స్ 2 సెక్షన్ 1, పీజీఆర్ఎస్ 4, డ్రైవర్స్ 3, ఆఫీస్ సబార్డినేట్స్- 5 మందిని కేటాయించారు.

Similar News

News January 2, 2026

రేపే TDP ఒంగోలు పార్లమెంటరీ అధ్యక్షుడి ప్రమాణం

image

టీడీపీ ఒంగోలు పార్లమెంటరీ అధ్యక్షుడిగా కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి నియమితులైన విషయం తెలిసిందే. ఆయన శనివారం ప్రమాణ స్వీకారం చేస్తారని నాయకులు తెలిపారు. ఒంగోలు పట్టణంలోని SGVS కళ్యాణ మండపంలో బాధ్యతలు తీసుకుంటారని చెప్పారు. జిల్లాలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని కోరారు.

News January 2, 2026

BREAKING మార్కాపురం జిల్లాలో మర్డర్!

image

మార్కాపురం జిల్లా బేస్తవారిపేట మండలం బీసీ కాలనీలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో మంచంపై నిద్రిస్తున్న జయంపు కృష్ణయ్య(55) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు నరికి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదుచేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News January 2, 2026

ఆదర్శంగా ప్రకాశం కలెక్టర్..!

image

ప్రకాశం కలెక్టర్ రాజాబాబు తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలిచింది. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ బొకేలు ఎవరూ తీసుకు రావద్దని, కేవలం విద్యార్థులకు ఉపయోగపడే మెటీరియల్ తీసుకురావాలని కలెక్టర్ ముందుగా సూచించారు. అధికారులు నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లను అందజేశారు. పెద్ద మొత్తంలో వచ్చిన పుస్తకాలను త్వరలో విద్యార్థులకు అందించనున్నారు.