News October 23, 2025
మార్కాపురం జిల్లా ఏర్పాటుకు మరో అడుగు

మార్కాపురం జిల్లా ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలను పంపించాలని భూ పరిపాలన శాఖ చీఫ్ కమిషనర్ జి.జయలక్ష్మి చెప్పారు. బుధవారం ఆమె అమరావతి సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఒంగోలు ప్రకాశం భవనం నుంచి కలెక్టర్ పి.రాజాబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా మార్కాపురం జిల్లా ప్రతిపాదనపై సుదీర్ఘ చర్చ సాగగా.. ప్రతిపాదనలపై దృష్టి సారించాలని కలెక్టర్‌కు జయలక్ష్మి సూచించారు.
Similar News
News October 23, 2025
డిజిటల్ అరెస్ట్ అంటూ కాల్స్.. హెచ్చరించిన ప్రకాశం పోలీస్.!

డిజిటల్ అరెస్టు స్కాంల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పోలీస్ కార్యాలయం బుధవారం ప్రకటన విడుదల చేసింది. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఐటి విభాగం పోలీసులు సైబర్ నేరాలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం డిజిటల్ అరెస్టు స్కాంపై ప్రజలను అప్రమత్తం చేస్తూ అధికారులు పలు సూచనలు జారీ చేశారు. ఇంటి కుటుంబ సభ్యుల పేర్లతో డిజిటల్ అరెస్ట్ అంటూ వచ్చే వార్తలను నమ్మవద్దన్నారు.
News October 23, 2025
ప్రకాశం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

జిల్లాలో వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో, ఏవైనా అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు తక్షణమే స్పందించడానికి జిల్లా పోలీసు శాఖ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలు పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయటం జరిగిందని, అవి 24×7 అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నదులు, వాగులు, వంకలు, చెరువుల వద్ద పికెట్ ఏర్పాటు చేయాలని అధికారులకు తెలిపారు.
News October 23, 2025
ఒంగోలు: 16 మందికి కారుణ్య నియామకాలు

ప్రభుత్వ సర్వీసులో చేరిన వారు చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవ చేయాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు చెప్పారు. బుధవారం ఆయన జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణతో కలిసి ప్రకాశం భవనంలోని తన ఛాంబరులో 16 మందికి కారుణ్య కోటాలో నియామక పత్రాలను అందించారు. విధుల నిర్వహణలో నైపుణ్యం పెంచుకుంటూ ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షిస్తూ వారిని అభినందించారు.