News April 12, 2025

మార్కాపురం తహశీల్దార్‌కి ప్రమాదం

image

ప్రకాశం జిల్లా మార్కాపురం తహశీల్దారు చిరంజీవికి పెను ప్రమాదం తప్పింది. శనివారం ఉదయం స్వయంగా తానే కారు నడుపుతూ మార్కాపురం నుంచి ఒంగోలు వెళ్తుండగా.. పొదిలి సమీపంలో ఎదురుగా వచ్చే వాహనాన్ని తప్పించబోయి కారు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో తహశీల్దార్ చిరంజీవికి స్వల్ప గాయాలయ్యాయి. కాగా ఈ ప్రమాదంలో కారు ధ్వంసం అయింది.

Similar News

News April 13, 2025

దర్శి: మహిళ దారుణ హత్య

image

దర్శికి చెందిన అన్నిబోయిన లక్ష్మి (45) కురిచేడు మండలం బోధనంపాడు వద్ద దారుణ హత్యకు గురయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఆదివారం పొలాల్లో లక్ష్మిని గుర్తుతెలియని వ్యక్తి రాయితో కొట్టి చంపేశాడు. తరువాత అతను కూడా గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 13, 2025

ప్రకాశం: 2024కి, ఇప్పటికీ 1 స్థానం డౌన్

image

నిన్న ఇంటర్ రిజల్ట్స్ విడుదలైన విషయం తెలిసిందే. ప్రకాశం జిల్లా విద్యార్థులు ఫస్ట్ ఇయర్‌లో 63 శాతం ఉత్తీర్ణతతో 19వ స్థానం, సెకండ్ ఇయర్‌లో 79 శాతంతో 16వ స్థానంలో నిలిచారు. గత ఏడాది ఫస్ట్ ఇయర్‌లో 72 శాతం ఉత్తీర్ణతతో 18వ స్థానం, సెకండ్ ఇయర్‌లో 59 శాతంతో 15వ స్థానంలో నిలిచారు. ప్రకాశం జిల్లా ఇంటర్ విద్యార్థులు ఈ ఏడాది, గత ఏడాదికంటే మంచి మార్కులు సాధించిన ర్యాంకుల విషయంలో ఒక స్థానం కిందకి వెళ్లింది.

News April 13, 2025

ప్రకాశం జిల్లా టాపర్లు వీరే!

image

ఒంగోలులోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న నలుగురు విద్యార్థులు తమ సత్తా చాటి జిల్లా స్థాయి ప్రథమ స్థానంలో నిలిచారు. ఎంపీసీ గ్రూప్‌లో బండి హర్షిని, కావలి హేమలత, ఎనిమి రెడ్డి సిరి 991/1000 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవగా, బైపీసీలో పాలకీర్తి హారిక 991/1000 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచారు. వీరిని కళాశాల బృందం అభినందించింది.

error: Content is protected !!