News April 5, 2025

మార్కాపురం: రైల్వే పట్టాలపై మృతదేహం కలకలం

image

మార్కాపురం రైల్వే స్టేషన్ ఔటర్ వద్ద పట్టాల పక్కన శనివారం మధ్యాహ్నం వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. గమనించిన స్థానికులు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడా లేదా రైల్లో నుంచి జారిపడ్డాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చనిపోయిన వ్యక్తి  వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Similar News

News April 6, 2025

కనిగిరి: కారుణ్య ఉద్యోగ నియామక పత్రం అందజేసిన ఎమ్మెల్యే ఉగ్ర

image

మిట్టపాలెం శ్రీ నారాయణ స్వామి వారి దేవస్థానం ప్రధాన అర్చకుడు సత్యనారాయణ శర్మ ఇటీవల మృతి చెందారు. ఆయన కుమారుడు నారాయణ స్వామికి దేవస్థానంలో జూనియర్ అసిస్టెంట్‌గా కారుణ్య నియామకం కింద ఉద్యోగం లభించింది. శనివారం నియామక ఉత్తర్వులు కనిగిరిలో MLA ఉగ్ర నరసింహ రెడ్డి నారాయణస్వామికి అందజేశారు. కార్యక్రమంలో నారాయణస్వామి ఆలయ ఈవో నరసింహ బాబు పాల్గొన్నారు.

News April 5, 2025

ఒంగోలు: బాధ్యతలు స్వీకరించిన సంయుక్త కలెక్టర్ గోపాలకృష్ణ

image

ప్రకాశంజిల్లా గ్రంథాలయం సంస్థ పర్సన్ ఇన్‌ఛార్జ్‌గా సంయుక్త కలెక్టర్ రోణంకి. గోపాలకృష్ణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా గ్రంథాలయ సంస్థలకు సంబంధించిన వ్యవహారాలను నిర్వహించడానికి జిల్లాల జాయింట్ కలెక్టర్‌లను పర్సన్ ఇన్‌ఛార్జ్‌గా నియమిస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ.. జిల్లా గ్రంథాలయం సంస్థకు రావలసిన సెస్సులు, గ్రంధాలయ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

News April 5, 2025

గిద్దలూరు: ఆత్మహత్య చేసుకొని రిటైర్డ్ ఆర్మీ జవాన్ మృతి

image

గిద్దలూరులోని కొంగలవీడు రోడ్డులో బిలాల్ మసీదు సమీపంలో ఓ వ్యక్తి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కొమరోలు మండలం అయ్యవారిపల్లికి చెందిన రిటైర్డ్ ఆర్మీ జవాన్ ముక్కర చెన్నారెడ్డి అనే వ్యక్తి గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

error: Content is protected !!