News January 2, 2026
మార్కాపురం: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

ఈ ఘటన పల్నాడు జిల్లాలో జరిగింది. మార్కాపురానికి చెందిన షేక్ కరీముల్లా(50), మాచర్లకు చెందిన నూర్జహాన్(45) బంధువులు. ఇద్దరూ ఫ్రూట్స్ బిజినెస్ చేస్తుంటారు. మాచర్ల నుంచి మార్కాపురానికి బైకుపై గురువారం బయల్దేరారు. వెల్దుర్తి మండలం శిరిగిరిపాడుకు చెందిన మహేశ్ బైకుపై మాచర్లకు పయనమయ్యాడు. శిరిగిరిపాడు వద్ద ఈ రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. కరీముల్లా, నూర్జహాన్ చనిపోగా మహేశ్ తీవ్రంగా గాయపడ్డాడు.
Similar News
News January 2, 2026
BREAKING మార్కాపురం జిల్లాలో మర్డర్!

మార్కాపురం జిల్లా బేస్తవారిపేట మండలం బీసీ కాలనీలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో మంచంపై నిద్రిస్తున్న జయంపు కృష్ణయ్య(55) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు నరికి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదుచేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News January 2, 2026
ఆదర్శంగా ప్రకాశం కలెక్టర్..!

ప్రకాశం కలెక్టర్ రాజాబాబు తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలిచింది. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ బొకేలు ఎవరూ తీసుకు రావద్దని, కేవలం విద్యార్థులకు ఉపయోగపడే మెటీరియల్ తీసుకురావాలని కలెక్టర్ ముందుగా సూచించారు. అధికారులు నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లను అందజేశారు. పెద్ద మొత్తంలో వచ్చిన పుస్తకాలను త్వరలో విద్యార్థులకు అందించనున్నారు.
News January 2, 2026
ఒంగోలు: రూ.5.69 కోట్ల మద్యం తాగేశారు..!

ప్రకాశం జిల్లాలో డిసెంబర్‌కు సంబంధించి రూ. 110 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు ప్రకటించారు. డిసెంబర్ 31వ తేదీ రూ.5.69 కోట్ల మద్యాన్ని షాపులకు తరలించారు. ఈ మేరకు భారీగా విక్రయాలు జరిగాయి. డిసెంబర్‌లో మొత్తం 5,2280 కేసుల బీర్లు విక్రయించారు. 2024 డిసెంబర్ కంటే 2025లో రూ.6కోట్ల వ్యాపారం అధికంగా జరిగినట్లు సమాచారం.


