News April 15, 2025
మార్గం మధ్యలో కార్మికుడి మృతి: ఎస్ఐ

దేవీపట్నం మండలం పోలవరం ప్రాజెక్టులో పని చేస్తున్న ఒడిశాకి చెందిన ఎలక్ట్రీషియన్ పరమ నాయక్ (25)సోమవారం జరిగిన ప్రమాదంలో మృతి చెందారని ఎస్ఐ షరీఫ్ తెలిపారు. మిషన్ వద్ద అతడు పని చేస్తుండగా కటింగ్ బేడ్ విరిగి మెడలో గుచ్చుకుని తీవ్రంగా రక్తస్రావం అయింది. దీంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడని పేర్కొన్నారు. మృతుడు ఒక ప్రైవేట్ కంపెనీలో కాంట్రాక్టు కార్మికుడుగా పని చేస్తున్నాడని తెలిపారు.
Similar News
News September 16, 2025
ఉమ్మడి కృష్ణాలో మిగిలిపోయిన 10 టీచర్ పోస్టులు

ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉపాధ్యాయ ఉద్యోగాలకు 1198 మందిని విద్యాశాఖ ఎంపిక చేసింది. ప్రభుత్వ, జడ్పీ, గిరిజన సంక్షేమ శాఖ, జువైనల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ల స్కూళ్లలో మొత్తంగా 1208 పోస్టులు నోటిఫై చేయగా.. వీటిలో 1198 పోస్టులకు మెరిట్ కమ్ రిజర్వేషన్ రోస్టర్ నిబంధనల మేరకు అభ్యర్థులను ఖరారు చేశారు. 10 పోస్టులకు అర్హులు లేకపోవడంతో వాటిని భర్తీ చేయలేదు. ఈ నెల 19న వీరికి నియామక ఉత్తర్వులు అందజేయనున్నారు.
News September 16, 2025
భారీగా పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగి రికార్డు స్థాయికి చేరాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.870 పెరిగి రూ.1,11,930కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10g గోల్డ్ రూ.800 ఎగబాకి రూ.1,02,600 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.1000 పెరిగి రూ.1,44,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News September 16, 2025
విశాఖ: వృద్ధురాలిని మోసం చేసిన కేసులో ముగ్గురి అరెస్టు

వృద్ధురాలి డబ్బులు దోచేసిన ముగ్గురిని విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సాగర్ నగర్‌లో ఉంటున్న వృద్ధురాలికి ఈ ఏడాది మే 16న ఫోన్ చేసి బంధువులుగా పరిచయం చేసుకున్నారు. ఆమె నుంచి ధఫదపాలుగా రూ.4 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు. డబ్బలు తిరిగి ఇవ్వకపోవడంతో మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బ్యాంక్ ఖాతాల ఆధారంగా రాజస్థాన్‌కి చెందిన మొయినుద్దీన్, గణేశ్, దినేశ్‌ను పట్టుకున్నారు.