News March 3, 2025
మార్చిలోనే సూర్రు మనిపిస్తున్న సూర్యుడు

మార్చి మొదటి వారంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భానుడు భగభగమంటున్నాడు. నిన్న అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాచలంలో 38.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. వరసగా మూడు రోజుల పాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పింది. ఎండల ప్రభావం ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా ఉండనుంది. సింగరేణి ప్రాంతం కనుక మిగతా జిల్లాలో కంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Similar News
News March 3, 2025
ఖమ్మం కలెక్టరేట్‌లో దివ్యాంగులకు ఉచిత భోజనం: కలెక్టర్

ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌కు వివిధ పనుల నిమిత్తం వచ్చే దివ్యాంగులకు ఉచిత భోజన సదుపాయాన్ని ఈనెల 5 నుంచి కల్పించనున్నట్లు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దివ్యాంగులు తమ సమస్యల పరిష్కారం, వివిధ పనుల కోసం సుదూర ప్రాంతాల నుంచి కలెక్టరేట్‌కు వస్తున్నారనే అంశం తన దృష్టికి వచ్చిందని చెప్పారు. దీంతో కలెక్టరేట్ క్యాంటీన్‌లో మధ్యాహ్నం ఉచిత భోజన వసతి కల్పించాలని నిర్ణయించామన్నారు.
News March 3, 2025
ఖమ్మం: MLC ఎన్నికలు.. మొదటి రౌండ్ ఫలితాలు

WGL-KMM-NLG ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు ఫలితాలను అధికారులు వెల్లడించారు.
1) PRTU అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి – 6,035
2) UTF అభ్యర్థి నర్సిరెడ్డి – 4,820
3) స్వతంత్ర అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి- 4,437
4) స్వతంత్ర అభ్యర్థి పూల రవీందర్- 3,115
5) BJP మద్దతు అభ్యర్థి సరోత్తంరెడ్డి- 2,289
కాగా మొత్తం 19 మంది అభ్యర్థులకు చెల్లిన ఓట్లు 23,641, చెల్లని ఓట్లు 494
News March 3, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం ∆} సత్తుపల్లిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ∆} ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల పర్యటన ∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} పైనంపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు ∆} వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన