News January 6, 2026
మార్చిలో అందుబాటులోకి ‘భూ భారతి’ పోర్టల్: మంత్రి

TG: రెవెన్యూ, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్, సర్వే- ల్యాండ్ రికార్డ్స్ విభాగాలను భూభారతి పోర్టల్ ద్వారా ఒకే గొడుగు కిందకు తెస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. ‘వ్యవసాయ, వ్యవసాయేతర, దేవదాయ, అటవీ, వక్ఫ్ భూముల వివరాలన్నీ పోర్టల్‌లో పొందుపరిచాం. ప్రజలకు పారదర్శకంగా మెరుగైన సేవలు అందేలా రూపొందించాం’ అని చెప్పారు. మార్చిలో దీన్ని ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు.
Similar News
News February 27, 2026
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్‌కు క్లీన్‌చిట్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బిగ్ రిలీఫ్ లభించింది. కేసులో ఆయనతో పాటు మాజీ మంత్రి మనీశ్ సిసోడియాను డిశ్ఛార్జ్ చేస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అభియోగాలపై ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది.
News February 27, 2026
పశ్చిమ గోదావరి జిల్లా వన్ స్టాప్ సెంటర్‌లో ఉద్యోగాలు

పశ్చిమ గోదావరి జిల్లా స్త్రీ, శిశు అభివృద్ధి సంస్థ వన్ స్టాప్ సెంటర్‌లో 13కాంట్రాక్ట్ పోస్టులకు అర్హతగల మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది. అడ్మినిస్ట్రేటర్, కేస్ వర్కర్, పారా లీగల్ పర్సనల్, పారా మెడికల్ పర్సనల్, సైకో-సోషల్ కౌన్సిలర్, ఆఫీస్ అసిస్టెంట్, MTS, సెక్యూరిటీ గార్డ్ పోస్టులు ఉన్నాయి. ఆసక్తిగల వారు మార్చి 7 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18-42 ఏళ్ల మధ్య ఉండాలి. సైట్: westgodavari.ap.gov.in
News February 27, 2026
మరో ప్రాణం తీసిన లోన్ యాప్

TG: ప్రభుత్వాలు హెచ్చరికలు చేస్తున్నా లోన్ యాప్ ఏజెంట్ల ఆగడాలు ఆగట్లేదు. వారి వేధింపులు తాళలేక మరో వ్యక్తి ప్రాణం తీసుకున్నారు. మేడ్చల్(D) ఘట్‌కేసర్‌లో ఆటో డ్రైవర్ సాయికుమార్(35) భార్య పేరిట లోన్ యాప్‌లో రుణం తీసుకున్నారు. సకాలంలో చెల్లించకపోవడంతో ఏజెంట్లు వేధించారు. భార్య ఫొటోలను SMలో పెడతామంటూ బ్లాక్‌మెయిల్ చేయడంతో ఉరివేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


