News January 1, 2026

మార్చి నుంచి గూగుల్ డేటా సెంటర్ పనులు

image

AP: విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ పనులు మార్చి నుంచి పూర్తిస్థాయిలో ప్రారంభం కానున్నాయని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. గూగుల్‌కు జనవరి 10వ తేదీ కల్లా తర్లువాడలో 308 ఎకరాలను అప్పగిస్తామని చెప్పారు. జనవరి మూడో వారంలో టీసీఎస్ క్యాంపస్ ప్రారంభం అవుతుందని వివరించారు. అడవివరంలో సింహాచలం దేవస్థానం భూముల కేటాయింపు ఫైలు ప్రభుత్వం వద్ద ఉందని వెల్లడించారు.

Similar News

News January 6, 2026

హైదరాబాద్‌లో అతి పెద్ద స్టీల్ బ్రిడ్జి

image

TG: హైదరాబాద్‌లో రూ.4,263 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్-2 నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది. ప్యారడైజ్ నుంచి శామీర్‌పేట వరకు 18.15 KM ప్రాజెక్టులో 11.52 KM స్టీల్ బ్రిడ్జి, హకీంపేట వద్ద 6 KM అండర్‌గ్రౌండ్ టన్నెల్ నిర్మాణం చేపట్టనున్నారు. ఇప్పటికే భూసేకరణ, టెండర్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఇందిరాపార్క్ నుంచి VST వరకు ఒక స్టీల్ బ్రిడ్జి (2.6 KM) ఉండగా, ఇది పూర్తైతే రాష్ట్రంలో రెండోది కానుంది.

News January 6, 2026

ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ.. ఎప్పుడంటే?

image

అగ్నివీర్ పోస్టుల భర్తీ కోసం సికింద్రాబాద్‌లోని AOC సెంటర్‌లో ఫిబ్రవరి 2 నుంచి మే 10 వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనుంది. ఇందులో అగ్నివీర్ జనరల్ డ్యూటీ, క్లర్క్, చెఫ్, సపోర్ట్ స్టాఫ్, ట్రేడ్స్‌మెన్ తదితర విభాగాల్లో నియామకాలు జరగనున్నాయి. 17.5 నుంచి 21 ఏళ్ల మధ్య ఉన్నవారు అర్హులు. పోస్టులను బట్టి టెన్త్, ఇంటర్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. పూర్తి వివరాల కోసం అధికారిక <>వెబ్‌సైట్‌<<>>ను సంప్రదించండి.

News January 6, 2026

థైరాయిడ్ పేషెంట్లు శీతాకాలంలో ఇవి తినకూడదు

image

థైరాయిడ్ రోగులు శీతాకాలంలో వేయించిన, కారంగా ఉండే ఆహారం, జంక్ ఫుడ్ తినకూడదని నిపుణులు చెబుతున్నారు. అలాగే సోయా ఉత్పత్తులు, క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకలీ, షుగర్, శుద్ధి చేసిన పిండి, బేకరీ ఉత్పత్తులు, టీ, కాఫీ ఎక్కువగా తీసుకోకూడదు. ఈ కాలంలో థైరాయిడ్ రోగులు సమతుల్యమైన, పోషకమైన ఆహారం తీసుకోవాలి. నట్స్, సీడ్స్, ఫ్రూట్స్, కూరగాయలు, తగినంత ప్రోటీన్ తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.