News January 24, 2026

మార్చి నుంచి బాలయ్య కొత్త మూవీ షురూ!

image

‘అఖండ2’తో ఇటీవల ప్రేక్షకులను పలకరించిన నందమూరి బాలకృష్ణ మరో కొత్త సినిమాను పట్టాలెక్కిస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఆయన నటించనున్నారు. అయితే గతంలో అనుకున్న కథను పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా కొత్త కథతో రాబోతున్నట్లు సమాచారం. మార్చి నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. గతంలో వీరి కాంబినేషన్‌లో వీరసింహారెడ్డి తెరకెక్కింది.

Similar News

News February 11, 2026

గోళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే అధిక కొలెస్ట్రాల్

image

బాడీలో కొలెస్ట్రాల్ స్థాయులు పెరిగినప్పుడు గోళ్లలో మార్పులు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా గులాబీ రంగులో ఉండే గోళ్లు రక్తప్రసరణ సరిగ్గా లేకపోవడంతో రంగుమారి పాలిపోయినట్టు/తెల్లగా కనిపిస్తాయి. ఒనికోరెక్సిస్ అని పిలిచే గాట్లు ఏర్పడతాయి. రక్త ప్రవాహం తగ్గడంతో పెరుగుదలకు కూడా ఎక్కువ సమయం పడుతుంది. ఒంకరగా పెరుగుతాయి. కొందరిలో నీలం/ఊదా రంగులో కనిపిస్తాయి.

News February 11, 2026

ఫిబ్రవరి 11: చరిత్రలో ఈరోజు

image

1847: అమెరికన్ శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్ జననం
1865: తెలుగు సాహితీవేత్త పానుగంటి లక్ష్మీ నరసింహారావు జననం
1942: బజాజ్ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకుడు జమ్నాలాల్ బజాజ్ మరణం
1974: సంగీత దర్శకుడు, గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు మరణం (ఫొటోలో)
1977: భారత మాజీ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ మరణం

News February 11, 2026

అజిత్ విమాన ప్రమాదం వెనుక కుట్ర: రోహిత్

image

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన <<18980385>>ప్రమాదం<<>> వెనుక కుట్ర దాగి ఉందని ఆయన మేనల్లుడు, NCP(SP) MLA రోహిత్ పవార్ సంచలన ఆరోపణలు చేశారు. ‘ముందు రోజే అజిత్ బారామతికి వెళ్లాల్సి ఉండగా అనుకోకుండా షెడ్యూల్ మారే పరిస్థితులు వచ్చాయి. విమానంలో సాంకేతిక తనిఖీలు సరిగ్గా జరిగాయా? పైలట్ కపూర్ గతంలో డ్రంకెన్ పైలట్ లిస్ట్‌లో ఉన్నారని, ప్రయాణానికి ముందు బ్రీత్ అనలైజర్ టెస్టులు జరిగాయా’ అని ప్రశ్నలు లేవనెత్తారు.