News January 19, 2026
మార్చి లాస్ట్ నుంచి TTD ఆలయాల్లో అన్నప్రసాదం

TTD ఆలయాల్లో అన్నప్రసాద వితరణ ప్రారంభించనున్నట్లు EO అనిల్ తెలిపారు. తిరుపతిలో సోమవారం ఆయన అధికారులతో సమీక్ష చేశారు. ప్రస్తుతం TTD పరిధిలోని 56 ఆలయాల్లో అన్నప్రసాద వితరణ కొనసాగుతోందన్నారు. మార్చి చివరికి అన్ని ఆలయాలలో 2 పూటలా అన్నప్రసాద వితరణ, పలు రాష్ట్రాలలో ఆలయాల నిర్మాణాలకు చర్యలు చేపట్టాలన్నారు. గౌహతి, పట్నా, కోయంబత్తూరు, బెల్గాంలో ఆలయాల నిర్మాణానికి స్థలాలను కేటాయించినట్లు పేర్కొన్నారు.
Similar News
News February 13, 2026
భైంసాలో ఇండిపెండెంట్ అభ్యర్థి WIN

భైంసా పట్టణంలోని రాహుల్ నగర్ (7వ వార్డు) ఫలితం వెలువడింది. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన రమాబాయి ప్రత్యర్థి రాహుల్(MIM)పై 277 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థి అధికార, ప్రతిపక్ష పార్టీలను వెనక్కి నెట్టి విజేతగా నిలవడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రమాబాయి గెలుపుతో ఆమె అనుచరులు, వార్డు ప్రజలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు.
News February 13, 2026
అసెంబ్లీలో మార్కాపురం MLA సంచలన వ్యాఖ్యలు

తమ జాయింట్ కలెక్టర్(JC) సరిగా పనిచేయడం లేదని మార్కాపురం MLA కందుల అన్నారు. ‘తర్లుపాడు(M) పూతలపాడు రైతుల భూముల వివరాల్లో ఊరి పేరు పోతవరంగా మార్చారు. దీంతో ఆ భూములు దేవదాయ శాఖవిగా మారడంతో అమ్ముకోలేకపోతున్నారు. దీనిపై 67 అర్జీలు ఇస్తే ఒక్కటీ పరిష్కరించలేదు. దీంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మా జిల్లాలో JCకు 1100 ఫైల్స్ వస్తే 100 పరిష్కరించి మిగిలినవి చెత్తలో పడేశారు’ అని MLA ఆరోపించారు.
News February 13, 2026
నర్సంపేట నాలుగో వార్డు కాంగ్రెస్ కైవసం

నర్సంపేట మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌లో నాలుగో వార్డు ఫలితం వెలువడింది. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన బీరం భరత్ రెడ్డి విజయం సాధించారు. ఆయన సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన తన సహోదరుడు బీరం నాగిరెడ్డిపై స్పష్టమైన ఆధిక్యంతో గెలుపొందారు. ఈ విజయం నాలుగో వార్డులో కాంగ్రెస్ బలాన్ని మరింత పటిష్టం చేయగా, స్థానికంగా పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.


