News February 26, 2026
మార్చి 14న పిడుగురాళ్లలో జాతీయ లోక్ అదాలత్

మార్చి 14న పిడుగురాళ్లలోని సివిల్ కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు సివిల్ కోర్టు జడ్జి టి.ప్రవళిక బుధవారం తెలిపారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామన్నారు. పిడుగురాళ్ల కోర్టు పరిధిలోని కక్షిదారులు రాజీ పడవలసిన కేసులు, చెక్ బౌన్స్, ఎక్సైజ్ కేసులు, కుటుంబ తగాదాలు కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు.
Similar News
News February 26, 2026
ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ బదిలీ

ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి బదిలీ అయ్యారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆయనను వికారాబాద్ జిల్లాకు బదిలీ చేస్తూ అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఆసిఫాబాద్‌లో తన బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేసిన ఆయన, త్వరలోనే వికారాబాద్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు, ప్రజలు సమన్వయంతో పనిచేసి అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు.
News February 26, 2026
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా అంకిత్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కలెక్టర్‌గా అంకిత్ ఐఏఎస్ నియమితులయ్యారు. నిజామాబాద్ అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించిన అంకిత్‌ను భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత కలెక్టర్ జితేష్ వి పాటిల్ టీజీ ఎన్పీడీసీఎల్ ఛైర్మన్ అండ్ మేనేజ్మెంట్ డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు.
News February 26, 2026
మెదక్ కలెక్టర్‌గా ప్రతిమా సింగ్

మెదక్ జిల్లాకు నూతన కలెక్టర్‌గా ప్రతిమ సింగ్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కలెక్టర్‌గా ఉన్న రాహుల్ రాజ్‌ను సహకార శాఖకు బదిలీ చేశారు. ప్రతిమా సింగ్ ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. కలెక్టర్‌గా పదోన్నతితో మెదక్ జిల్లాకు బదిలీ అయ్యారు. ప్రతిమా సింగ్ గతంలో మెదక్ జిల్లా అదనపు కలెక్టర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే.


