News February 26, 2026

మార్చి 14న పిడుగురాళ్లలో జాతీయ లోక్ అదాలత్

image

మార్చి 14న పిడుగురాళ్లలోని సివిల్ కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు సివిల్ కోర్టు జడ్జి టి.ప్రవళిక బుధవారం తెలిపారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామన్నారు. పిడుగురాళ్ల కోర్టు పరిధిలోని కక్షిదారులు రాజీ పడవలసిన కేసులు, చెక్ బౌన్స్, ఎక్సైజ్ కేసులు, కుటుంబ తగాదాలు కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు.

Similar News

News February 26, 2026

భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా అంకిత్

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కలెక్టర్‌గా అంకిత్ ఐఏఎస్ నియమితులయ్యారు. నిజామాబాద్ అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించిన అంకిత్‌ను భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత కలెక్టర్ జితేష్ వి పాటిల్‌ టీజీ ఎన్పీడీసీఎల్ ఛైర్మన్ అండ్ మేనేజ్మెంట్ డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు.

News February 26, 2026

మెదక్ కలెక్టర్‌గా ప్రతిమా సింగ్

image

మెదక్ జిల్లాకు నూతన కలెక్టర్‌గా ప్రతిమ సింగ్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కలెక్టర్‌గా ఉన్న రాహుల్ రాజ్‌ను సహకార శాఖకు బదిలీ చేశారు. ప్రతిమా సింగ్ ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. కలెక్టర్‌గా పదోన్నతితో మెదక్ జిల్లాకు బదిలీ అయ్యారు. ప్రతిమా సింగ్ గతంలో మెదక్ జిల్లా అదనపు కలెక్టర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే.

News February 26, 2026

నారాయణపేట కొత్త కలెక్టర్‌గా ప్రతీక్ జైన్ నియామకం

image

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా,నారాయణపేట జిల్లాకు నూతన కలెక్టర్‌ను ప్రభుత్వం నియమించింది.ఇప్పటివరకు వికారాబాద్ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న ప్రతీక్ జైన్‌ను నారాయణపేట జిల్లాకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.నారాయణపేట కలెక్టర్‌గా పనిచేసిన సిక్తా పట్నాయక్ బదిలీ కావడంతో, ఆ స్థానంలో ప్రతీక్ జైన్ బాధ్యతలు స్వీకరించనున్నారు.