News February 27, 2026

మార్చి 16 నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలు: కలెక్టర్

image

ఉన్నత చదువులకు తొలి మెట్టైన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ప్రారంభం కానున్నాయని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై వివరాలు శుక్రవారం తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారన్నారు. పరీక్షలకు ఇంకా కొన్ని రోజులే సమయం ఉండడంతో మంచి మార్కులు సాధించేందుకు విద్యార్థులు పాటు పడాలన్నారు.

Similar News

News March 1, 2026

OMG.. HYDలో భారీ LIVE FISH

image

నగర శివారు కీసరలోని గోషాల వద్దగల చెరువులో భారీ చేప జాలరుల వలకు చిక్కింది. ఓ వ్యక్తి ఆదివారం సరదగా అలా చెరువు వద్దకు వెళ్లాడు. 14కేజీల భారీ చేప చిక్కను కిలోల లెక్కన కొనుగోలు చేశాడు. దీంతో కుటుంబమంతా సంతోషం వ్యక్తం చేస్తుంది. పక్కనే గ్రౌండ్‌లో ఉన్న ప్లేయర్స్, స్థానికులు ఈ చేపను ఫొటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు. మీరెప్పుడైనా ఇంత పెద్ద చేపను లైవ్‌లో చూశారా?

News March 1, 2026

VZM: ఉదయాన్నే ప్రమాదం.. వ్యక్తి మృతి

image

రామభద్రపురం మండలం బూసాయవలస(ముచర్ల వలస) గ్రామ సమీపంలో సాయి కృష్ణ ఆగ్రో కోల్డ్ స్టోరేజ్ దగ్గర ఆదివారం ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందాడు. ఇతని వయసు సుమారు 65 ఏళ్లు ఉండవచ్చని భావిస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీస్‌లు దర్యాప్తు చేస్తున్నారు.

News March 1, 2026

GNT: విషాదం.. పిల్లలకు టిఫిన్ తెచ్చేందుకు వెళ్లి దుర్మరణం

image

తెనాలిలోని పినపాడు మద్రాస్ రైల్వే గేట్ వద్ద ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. కరేటి సురేశ్ (45) తన పిల్లల కోసం టిఫిన్ తెచ్చేందుకు బయటకు వెళ్లి, పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఒకేసారి రెండు రైళ్లు రావడంతో గందరగోళానికి గురైన సురేశ్‌ను ఒకటో నెంబర్ ట్రాక్‌పై వస్తున్న రైలు బలంగా ఢీకొట్టింది. తలకు తీవ్ర గాయమై ఆయన ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.