News February 28, 2025
మార్చి 2న ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి యోగా పోటీలు

ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి యోగా పోటీలు మార్చి 2న సూర్యాపేటలోని బ్రాహ్మణ కళ్యాణ మండపంలో సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు యోగా గురువు చాడ పాపిరెడ్డి తెలిపారు. శుక్రవారం సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రంలో యోగ పోటీల గురించి సాధకులతో కలిసి మాట్లాడారు. మొట్టమొదటిసారిగా సూర్యాపేటలో ఉమ్మడి జిల్లా స్థాయి యోగ పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News November 11, 2025
జగిత్యాలలో నేటి మార్కెట్ ధరలు

జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో నేడు పలికిన వివిధ దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు క్వింటాల్ గరిష్ఠ ధర రూ.2,201, కనిష్ఠ ధర రూ.1,600, వరి ధాన్యం(1010) గరిష్ఠ ధర రూ.1,961, కనిష్ఠ ధర రూ.1,810, వరి ధాన్యం(BPT) గరిష్ఠ ధర రూ.2,041, కనిష్ఠ ధర రూ.1,930, వరి ధాన్యం(HMT) ధర రూ.2,261, వరి ధాన్యం(JSR) గరిష్ఠ ధర రూ.2,631, కనిష్ఠ ధర రూ.1,951గా పలికాయని మార్కెట్ అధికారులు తెలిపారు.
News November 11, 2025
ఢిల్లీ పేలుళ్లు.. గుంటూరు పోలీసుల అప్రమత్తం

ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో గుంటూరు జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా వాహనాల తనిఖీలు చేపట్టారు. ప్రజల భద్రత కోసం రైల్వేస్టేషన్, బస్టాండ్, వాణిజ్య సముదాయాలు, జనసంచారం అధికంగా ఉన్న ప్రాంతాల్లో తనిఖీలు జరిగాయి. గుర్తుతెలియని వ్యక్తులు సంచారం ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
News November 11, 2025
NZB: ఢిల్లీలో పేలుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది: ఎంపీ

ఢిల్లీలో సోమవారం సాయంత్రం జరిగిన పేలుడు ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఎంపీ అర్వింద్ ట్వీట్ చేశారు.


