News March 1, 2026
మార్చి 3న బాసర ఆలయం మూసివేత

చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్ తెలిపారు. ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ ఉప ఆలయాలను కూడా మూసివేస్తామన్నారు. మంగళవారం తెల్లవారుజామునే అమ్మవార్లకు అభిషేకాలు, అర్చనలు, నివేదనలు పూర్తి చేసి, ఉదయం 7 గంటలకు ఆలయ ద్వారాలను మూసివేస్తామని వివరించారు. తిరిగి అదే రోజు సాయంత్రం 7 గంటలకు మహా సంప్రోక్షణ నిర్వహిస్తామన్నారు.
Similar News
News March 2, 2026
ఐసీడీఎస్ పనితీరుపై కలెక్టర్ సమీక్ష

కర్నూలు కలెక్టరేట్ సమావేశ మందిరంలో CDPOలు, సూపర్వైజర్లతో ICDS శాఖ పనితీరుపై మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, కలెక్టర్ ఏ.సిరి ఇవాళ సమీక్షించారు. ప్రజల్లో శాఖపై సానుకూల అభిప్రాయం పెంపు కోసం చర్యలు తీసుకోవాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. లబ్ధిదారులకు పోషకాహారం, గర్భిణులకు అందే సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
News March 2, 2026
పాక్ చెత్త ఆట.. ఒక్కో క్రికెటర్‌పై 50 లక్షల ఫైన్!

T20 WC సెమీస్ చేరడంలో ఫెయిల్ అయిన పాక్ ప్లేయర్లపై ఆ దేశ క్రికెట్ బోర్డు సీరియస్ అయ్యింది. ఒక్కొక్కరికీ 50 లక్షల పాకిస్థానీ రూపాయల (సుమారు ₹16 లక్షలు) ఫైన్ వేసినట్లు ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ పేర్కొంది. గ్రూప్ స్టేజ్‌లో ఇండియా చేతిలో ఓడినప్పుడే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. S-8లో ఇంగ్లండ్ చేతిలో ఓడటం, తర్వాత శ్రీలంకపై గెలిచినా రన్ రేట్ సరిపోకపోవడంతో పాక్ టోర్నీ నుంచి బయటకొచ్చిన సంగతి తెలిసిందే.
News March 2, 2026
TTDలో 30 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

తిరుమల తిరుపతి దేవస్థానం(<


