News January 4, 2025

మార్చి 8న జాతీయ లోక్ అదాలత్: జిల్లా జడ్జి

image

మార్చి 8న జరగబోయే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ్ చక్రవర్తి పిలుపునిచ్చారు. శుక్రవారం తన ఛాంబర్ లోని పలు ప్రైవేట్ చిట్ ఫండ్ ఫైనాన్స్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఫైనాన్స్ కంపెనీకి చెందిన కేసులన్నీ లోక్ అదాలత్ లో పరిష్కరించుకోవాలని సూచించారు. ఎక్కువ కేసులు రాజీ చేసుకునే ప్రయత్నం చేయాలన్నారు.

Similar News

News January 6, 2025

VZM: ‘8న జరగాల్సిన పరీక్ష 11కు వాయిదా’

image

కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో భాగంగా విజయనగరం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరుగుతున్న దేహదారుఢ్య పరీక్షల్లో అధికారులు స్వల్ప మార్పు చేశారు. ఈనెల 8న జరగాల్సిన దేహదారుఢ్య పరీక్షలను 11కి వాయిదా వేసినట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఛైర్మన్ ఎం.రవి ప్రకాశ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి విజయనగరం జిల్లాతో పాటు పీఈటీ పరీక్షలు జరిగే శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో అభ్యర్థులు గమనించాలని కోరారు.

News January 6, 2025

VZM: NDA కో-ఆర్డినేషన్ సమావేశంలో జిల్లా నేతలు

image

ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనను పురస్కరించుకొని విశాఖలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన కోఆర్డినేషన్ సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, మార్క్ ఫెడ్ ఛైర్మన్ కర్రోతు బంగార్రాజు, తదితరులు పాల్గొన్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లు, జన సమీకరణ తదితర అంశాలపై కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పలు సూచనలు అందజేశారు.

News January 5, 2025

పెదమానాపురం గేట్ మధ్యలో చిక్కుకున్న వ్యాన్..!

image

దత్తిరాజేరు మండలం పెదమానాపురం రైల్వే ట్రాక్ మధ్యలో ఆదివారం రాత్రి వ్యాన్ చిక్కుకుంది. నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారిపై ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉండడం, రైళ్లు ఎక్కువగా వెళ్లడంతో మాటిమాటికీ గేట్ పడుతుంది. ట్రాఫిక్ క్లియర్ అయ్యేలోపు మళ్ళీ గేట్ వేసే క్రమంలో వ్యాన్ చిక్కుకుంది. దీంతో కాసేపు ఏం జరుగుతుందోనని గందరగోళం నెలకొంది. రైల్వే సిబ్బంది గమనించి ట్రైన్ వచ్చేలోపు గేట్ తీయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.